ఆవిషయంలో మాత్రం మళ్లీ జగన్, కేసీఆర్ మధ్య దూరం? వీళ్లు ఇక కలిసే చాన్సే లేదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ఆవిషయంలో మాత్రం మళ్లీ జగన్, కేసీఆర్ మధ్య దూరం? వీళ్లు ఇక కలిసే చాన్సే లేదా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 January 2021,10:25 am

Ys jagan , KCR జగన్, కేసీఆర్.. ఇద్దరూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అందులోనూ మొదట్లో ఇద్దరి మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేది. జగన్.. హైదరాబాద్ వచ్చి.. ప్రగతి భవన్ లో విందులో పాల్గొని కేసీఆర్ తో ముచ్చటించి మరీ ఏపీకి వెళ్లేవారు. కేసీఆర్ కూడా జగన్ తో మంచిగానే ఉండేవారు. కానీ.. తర్వాత వాళ్లిద్దరికీ చెడింది. ప్రస్తుతం ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

telangana cm kcr and andhra pradesh cm jagan on irrigation projects

telangana cm kcr and andhra pradesh cm jagan on irrigation projects

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక.. ముందుగా తెలంగాణ వచ్చి సీఎం కేసీఆర్ ను కలిశారు. అప్పుడు ఇద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలం కావాలంటే ఏం చేయాలో.. ఎటువంటి ప్రాజెక్టులు నిర్మించాలో డిస్కస్ చేశారు. తెలుగు రాష్ట్రాలను ఎక్కడికో తీసుకెళ్దాం అని అనుకున్నారు. కానీ.. ఏదీ వర్కవుట్ కాలేదు.

అప్పట్లో ఏపీలో నిర్మించిన.. నిర్మిస్తున్న ప్రాజెక్టులపై తెలంగాణ కానీ.. సీఎం కేసీఆర్ గానీ అభ్యంతరం చెప్పలేదు. అలాగే.. తెలంగాణలో నిర్మించిన.. నిర్మిస్తున్న ప్రాజెక్టులపై జగన్ మోహన్ రెడ్డి కానీ.. ఏపీ కానీ అభ్యంతరం చెప్పలేదు. కానీ.. తర్వాత తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అడ్డుపుల్లలు వేయడం.. ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అడ్డుపుల్లలు వేయడం ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టుల సమస్యలపై కేంద్రానికి

చివరకు వీళ్లిద్దరి గొడవ.. కేంద్రం దాకా వెళ్లింది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం ఆరోపణ చేయడం.. తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఆరోపణ చేయడం.. అక్కడితో ఆగకుండా.. కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేయడంతో.. ప్రస్తుతం కేంద్రమే ఇక రంగంలోకి దిగింది. అసలు.. తెలంగాణ, ఏపీలో ఏం ప్రాజెక్టులు కడుతున్నారు. ఎన్ని కడుతున్నారు. వాటికి సంబంధించిన డీపీఆర్ లను వెంటనే కేంద్రానికి సమర్పించాలంటూ కేంద్రం రెండు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.

డీపీఆర్ సమర్పిస్తే అంతే

నిజానికి.. డీపీఆర్ లను సమర్పిస్తే.. కేంద్రం నుంచి చాలా సమస్యలు వస్తాయి. అది రెండు రాష్ట్రాలకూ సమస్యే. ఈ సమయంలో కేసీఆర్, జగన్ ఏం చేస్తారు. ఇద్దరూ కాంప్రమైజ్ అయిపోతారా? లేక అన్ని ప్రాజెక్టుల డీపీఆర్ లను సమర్పించి.. కేంద్రానికి సరెండర్ అవుతారా? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది