Modi : తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్నటి వరకు బీజేపీ తో మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గానే అనిపించింది. రాష్ట్ర నాయకత్వం తో విభేదాలు ఉన్నా రాష్ట్రం లో గొడవలు జరుగుతున్న కేంద్రం లో ఉన్న మోడీ కి కెసిఆర్ మద్దతు తెలుపుతూనే వచ్చారు. పలు విషయాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దక్కింది ప్రధాని మోడీ కి కేసీఆర్ మద్దతుగానే నిలుస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో పలు విషయాల్లో మోడీకి కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని ఒకానొక సమయం లో కేసీఆర్ కూడా ప్రశంసల్లో ముంచెత్తాడు. కానీ తాజాగా బడ్జెట్ పై మాట్లాడేందుకు కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో మోడీ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ తో పాటు సొంత పార్టీ టిఆర్ఎస్ లో కూడా చర్చ కు తెరలేపారు.
ఇన్నాళ్లు బిజెపి రాష్ట్ర నాయకత్వం తోనే విభేదాలు అనుకుంటే ఇప్పుడు ఏకంగా మోడీ తోనే సీఎం కేసీఆర్ డీకొట్టబోగా ఉన్నాడు అంటూ తాజాగా ఈ వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంపై సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా లో ప్రధాన అంశం అయ్యాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం ముఖ్యంగా మోడీ అమిత్ షా ల కు చేరే ఉంటాయి. కనుక ముందు ముందు బిజెపి మరియు టిఆర్ఎస్ ల మధ్య వైరం మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తమను రాజకీయంగా విమర్శించిన వారిని కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో ఇప్పటికే చూశాము. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బిజెపి కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టింది.త్వరలోనే కేసీఆర్ ని కూడా బిజెపి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసినా ఆశ్చర్యం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ అదే కనుక నిజమైతే కేసీఆర్ మళ్లీ మోడీ భజన చేస్తారా లేదంటే ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్న రాజకీయ శక్తులతో పని చేస్తారా అనేది చూడాలి. మరో రెండున్నర సంవత్సరాలు పార్లమెంటు ఎన్నికలకు సమయం ఉంది. కనుక అప్పటి వరకు ఏం జరుగుతుందో అనేది ఆసక్తిగా ఉంది. తెలంగాణలో బీజేపీని ఎదగనివ్వకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొందరి వాదన. మరి కొందరు మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింతగా తొక్కేందుకు బీజేపీ పై యుద్దం ను కేసీఆర్ తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అసలు విషయం అనేది వచ్చే ఎన్నికల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.