Modi : డైరెక్ట్‌ మోడీపై కేసీఆర్‌ యుద్దం… ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లున్నాడు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Modi : డైరెక్ట్‌ మోడీపై కేసీఆర్‌ యుద్దం… ఏదో పెద్ద ప్లాన్ వేసినట్లున్నాడు

 Authored By himanshi | The Telugu News | Updated on :2 February 2022,9:30 pm

Modi : తెలంగాణ సీఎం కేసీఆర్ మొన్నటి వరకు బీజేపీ తో మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు గానే అనిపించింది. రాష్ట్ర నాయకత్వం తో విభేదాలు ఉన్నా రాష్ట్రం లో గొడవలు జరుగుతున్న కేంద్రం లో ఉన్న మోడీ కి కెసిఆర్ మద్దతు తెలుపుతూనే వచ్చారు. పలు విషయాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దక్కింది ప్రధాని మోడీ కి కేసీఆర్‌ మద్దతుగానే నిలుస్తూ వచ్చారు. పలు సందర్భాల్లో పలు విషయాల్లో మోడీకి కితాబు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీని ఒకానొక సమయం లో కేసీఆర్ కూడా ప్రశంసల్లో ముంచెత్తాడు. కానీ తాజాగా బడ్జెట్ పై మాట్లాడేందుకు కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అందులో మోడీ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ తో పాటు సొంత పార్టీ టిఆర్ఎస్ లో కూడా చర్చ కు తెరలేపారు.

ఇన్నాళ్లు బిజెపి రాష్ట్ర నాయకత్వం తోనే విభేదాలు అనుకుంటే ఇప్పుడు ఏకంగా మోడీ తోనే సీఎం కేసీఆర్ డీకొట్టబోగా ఉన్నాడు అంటూ తాజాగా ఈ వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చింది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వంపై సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జాతీయ మీడియా లో ప్రధాన అంశం అయ్యాయి. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం ముఖ్యంగా మోడీ అమిత్ షా ల కు చేరే ఉంటాయి. కనుక ముందు ముందు బిజెపి మరియు టిఆర్ఎస్ ల మధ్య వైరం మరింత ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తమను రాజకీయంగా విమర్శించిన వారిని కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ఏ స్థాయిలో టార్గెట్ చేసిందో ఇప్పటికే చూశాము. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బిజెపి కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టింది.త్వరలోనే కేసీఆర్ ని కూడా బిజెపి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసినా ఆశ్చర్యం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telangana cm kcr fire on budget and pm narendra modi

Telangana cm kcr fire on budget and pm narendra modi

Modi : కేసీఆర్‌ కు కేంద్రం నుండి కష్టాలు తప్పవా?

ఒకవేళ అదే కనుక నిజమైతే కేసీఆర్ మళ్లీ మోడీ భజన చేస్తారా లేదంటే ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్న రాజకీయ శక్తులతో పని చేస్తారా అనేది చూడాలి. మరో రెండున్నర సంవత్సరాలు పార్లమెంటు ఎన్నికలకు సమయం ఉంది. కనుక అప్పటి వరకు ఏం జరుగుతుందో అనేది ఆసక్తిగా ఉంది. తెలంగాణలో బీజేపీని ఎదగనివ్వకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్‌ ఈ ప్రయత్నాలు చేస్తున్నారు అనేది కొందరి వాదన. మరి కొందరు మాత్రం కాంగ్రెస్ పార్టీని మరింతగా తొక్కేందుకు బీజేపీ పై యుద్దం ను కేసీఆర్‌ తన రాజకీయ వ్యూహంలో భాగంగా ఇలా చేస్తున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అసలు విషయం అనేది వచ్చే ఎన్నికల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది