అప్పుడు కారు.. సారు.. కేసీఆర్.. ఇప్పుడు నాగార్జునసాగర్? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

అప్పుడు కారు.. సారు.. కేసీఆర్.. ఇప్పుడు నాగార్జునసాగర్?

 Authored By jagadesh | The Telugu News | Updated on :9 December 2020,9:19 am

తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం దూకుడు మీదున్నారు. నిజానికి దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు ఒకరకమైన భయాన్ని పరిచయం చేశాయి. ఇప్పటి వరకు ఒకలెక్క.. ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా.. 2014 నుంచి అప్రతిహాతంగా గెలుస్తూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీకి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్రేక్ వేశాయి.

telangana cm kcr focus on nagarjunasagar

telangana cm kcr focus on nagarjunasagar

దీంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమయింది. అందుకే ముందున్న నాగార్జునసాగర్ ఎన్నికల మీద సీఎం కేసీఆర్ దృష్టి సారిస్తున్నారు. నాగార్జున సాగర్ ఉపఎన్నిక ఎప్పుడు జరగనుంది అనే విషయం ప్రస్తుతం అనవసరం. ఇంకో నెలకు ఎన్నికలు వచ్చినా.. రెండు నెలలకు వచ్చినా.. నాగార్జునసాగర్ లో గెలిచి టీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయిపోయారట.

వాస్తవానికి కేసీఆర్ ను తక్కువ అంచనా వేసినవాళ్లు అమాయకులు. ఆయన స్ట్రాటజీలను అందుకునే రాజకీయ నాయకుడే లేడు. అందుకే ఎవరి వల్లా కాని తెలంగాణను తీసుకొచ్చి చూపించారు. ఆయన ఏదైనా చెబితే నూరు ఆరైనా… ఆరు నూరైనా చేసి చూపిస్తారు.

హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ప్రసంగించినప్పుడే స్పష్టంగా చెప్పారు. హైదరాబాద్ జోలికొస్తే.. నేను ఢిల్లీకి వస్తా… అంటూ బెదిరించారు కూడా. అయినప్పటికీ.. బీజేపీ హైదరాబాద్ ను టార్గెట్ చేసింది. అందుకే బీజేపీకి సరైన బుద్ధి చెప్పాలని రివర్స్ లో నరుక్కుంటూ వెళ్తున్నారు. భారత్ బంద్ కు మద్దతు తెలపడం, రైతుల పట్ల సంఘీభావం తెలపడం లాంటివి అందుకే.

ఇన్నిరోజులు ఒక లెక్క.. కానీ.. ఇప్పటి నుంచి సీఎం కేసీఆర్ ది ఇంకో లెక్క అంటున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. తెలంగాణలోనే కాదు.. కేంద్రం నుంచి కూడా తనపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు మరింత బలంగా ముందుకు వస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాజకీయంగానే కాకుండా… ప్రభుత్వ పథకాలపైన కూడా మరింత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈసారి ప్రత్యర్థులకు తన వ్యూహాలు చిక్కకుండా.. మరింత అప్రమత్తమవుతున్నారు.

ఎందుకంటే.. నాగార్జునసాగర్ కాంగ్రెస్ కంచుకోట. అందులోనూ అక్కడ జానారెడ్డిదే హవా. జానారెడ్డి ఎక్కడ ఉంటే.. ఆ పార్టీదే గెలుపు. జానారెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో… టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పోటీదారుడు అంటే జానారెడ్డి మాత్రమే. ఆయన్ను ఎదుర్కోగలిగితే.. నాగార్జునసాగర్ టీఆర్ఎస్ కు చిక్కినట్టే. కాంగ్రెస్, బీజేపీ పార్టీలను తిప్పికొట్టేందుకు ముందుగానే క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ను ప్రిపేర్ చేస్తున్నారు సీఎం. ఇప్పటికే ఆయన దూకుడును ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి. మున్ముందు ఆయన దూకుడును ఎలా తట్టుకుంటారో వేచి చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది