
Telangana DSC : నిరుద్యోగులకు శుభవార్త... డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల... ఏ కేటగిరీ ఎన్ని పోస్ట్లంటే..?
Telangana DSC : తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ రానే వచ్చింది. తాజాగా ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ ఉద్యోగాలు మనకు డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఖాళీలు : ఇక ఈ నోటిఫికేషన్ లో మొత్తం 11,062 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేశారు. ఇక వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2629 ,భాషా పండితులు 727 ,పీఈటీలు 182 ,ఎస్జీటీలు 6508 అలాగే ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220 ఎస్జిటిలో 796 పోస్టులు ఉన్నాయి.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 11చోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.
రుసుము : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారికి పరీక్షా రుసము రూ.1000 గా నిర్ణయించడం జరిగింది.
అప్లై చేసే విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. అయితే గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరల ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు మాత్రమే డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఇది ఇలా ఉంటే గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 ఉద్యోగ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.ఇక ఈ ఉద్యోగాలకు దాదాపు 1. 75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ పరీక్షలను నిర్వహించాలి అనుకున్న సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో డీఎస్సీ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు స్కూల్లలో టీచర్ల పోస్టులు చాలావరకు ఖాళీగా ఉండటంతో గుర్తించిన రేవంత్ రెడ్డి సర్కార్ అదనపు పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ ని విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోని 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని పాత నోటిఫికేషన్ రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.