Telangana DSC : నిరుద్యోగులకు శుభవార్త… డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… జిల్లాల వారిగా పోస్ట్‌ల వివ‌రాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Telangana DSC : నిరుద్యోగులకు శుభవార్త… డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… జిల్లాల వారిగా పోస్ట్‌ల వివ‌రాలు..!

 Authored By aruna | The Telugu News | Updated on :29 February 2024,8:30 pm

Telangana DSC : తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్ రానే వచ్చింది. తాజాగా ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ ఉద్యోగాలు మనకు డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

ఖాళీలు : ఇక ఈ నోటిఫికేషన్ లో మొత్తం 11,062 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విడుదల చేశారు. ఇక వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2629 ,భాషా పండితులు 727 ,పీఈటీలు 182 ,ఎస్జీటీలు 6508 అలాగే ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220 ఎస్జిటిలో 796 పోస్టులు ఉన్నాయి.

ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో మొత్తం 11చోట్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

రుసుము : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారికి పరీక్షా రుసము రూ.1000 గా నిర్ణయించడం జరిగింది.

అప్లై చేసే విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. అయితే గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు మరల ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు : ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు మాత్రమే డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తారు.

ఇది ఇలా ఉంటే గత ఏడాది సెప్టెంబర్ 6న 5,089 ఉద్యోగ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.ఇక ఈ ఉద్యోగాలకు దాదాపు 1. 75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ పరీక్షలను నిర్వహించాలి అనుకున్న సమయంలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో డీఎస్సీ పరీక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు స్కూల్లలో టీచర్ల పోస్టులు చాలావరకు ఖాళీగా ఉండటంతో గుర్తించిన రేవంత్ రెడ్డి సర్కార్ అదనపు పోస్టులతో కలిపి మెగా డీఎస్సీ ని విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోని 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని పాత నోటిఫికేషన్ రద్దుచేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది