Goda badi : సర్కారు బడి.. ప్రైవేటు బడి పేరు విన్నాం కానీ.. ఈ గోడ బడి ఏంది? అంటారా? అవును.. దీని పేరు గోడ బడి. మామూలుగా స్కూల్ లో బోర్డు మీద ఏదైనా రాస్తూ పాఠాలు చెబుతుంటారు మాస్టార్లు. కానీ.. ఈ గోడ బడి ప్రత్యేకత ఏంటంటే.. తెల్లగా ఉన్న గోడ మీద విద్యార్థులు నేర్చుకోవాల్సిన వన్నీ ముందే రాసేస్తారు. ఇక అవి పర్మినెంట్ గా అక్కడే ఉంటాయి. వాటిని రోజూ పిల్లలకు నేర్పిస్తారు. అదే గోడబడి. ఈ గోడ బడి ఎక్కడ ఉందో తెలుసా? తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలో ఉన్న మొర్రిగూడ అనే గ్రామంలో.
ఆ గ్రామంలో ఎక్కువగా ఆదివాసీలు నివసిస్తుంటారు. ఆదివాసీలు అంటేనే ఎంతో వెనుకబడి ఉంటారు తెలుసు కదా. ఆ గ్రామం కూడా ఎక్కడో అడవిలో ఉంటుంది. అక్కడ సౌకర్యాలు చాలా తక్కువ. ఆ ఊళ్లో కనీసం నెట్ వర్క్ కూడా రాదు. ఫోన్ లో సిగ్నల్ కూడా రాదు. కరోనా కాలంలో ఆన్ లైన్ క్లాసులు వినాలంటే ఆ ఊరిలోని పిల్లలకు చాలా ప్రాబ్లమ్ అయింది. ఆ సమస్య నుంచి పుట్టిందే ఈ గోడ బడి.
గోడ బడి అనే ఆలోచన వచ్చింది ఒక పోలీసుకు. అవును.. తిర్యాణి ఎస్సై రామారావుకు ఈ ఐడియా వచ్చింది. ఆయన చొరవతోనే ఆ ఊళ్లో గోడ బడి ఏర్పాటు అయింది. ఆ గూడెంలో మెయిన్ సెంటర్ లో ఉన్న గోడలకు తెల్లని పెయింట్ వేసి.. పిల్లలు చదువుకునే ముఖ్యమైన విషయాలను అక్కడ రాయించారు. తెలుగు, ఇంగ్లీష్ అక్షరమాలలు, గుణింతాలు, అంకెలు.. ఇలా.. పిల్లలు ఆ వయసులో నేర్చుకోవాల్సిన వన్నింటినీ ఆ గోడల మీద రాయించారు.
ఎందుకంటే.. పిల్లలు స్కూళ్లకు వెళ్లి సంవత్సరం దాటింది. మళ్లీ ఎప్పుడు స్కూళ్లు తెరుస్తారో కూడా తెలియదు. అందుకే.. వాళ్లు నేర్చుకున్న పాఠాలు మరిచిపోకుండా ఉండేందుకు.. వాళ్లు పైతరగతులకు వెళ్లినప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. అలా గోడబడి ఏర్పాటు చేసి.. ఆ గూడెంలోని యువకులు, యువతులతో పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు.
అలా ఒక్క ఆ గూడెంలోనే కాదు.. ఆ గూడెం పక్కనే ఉన్న మిగితా ఆదివాసీల గూడేలలోనూ ఇలాంటి గోడ బడులను ఆ ఎస్సై ఏర్పాటు చేయించారట. ముందు అక్కడ సక్సెస్ కావడంతో మిగితా ఆదివాసీల ప్రాంతాల్లో ఏర్పాటు చేయించి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. ఆన్ లైన్ లో క్లాసులు వినలేని పిల్లలంతా.. ఉదయం లేవగానే గోడ బడి వద్దకు చేరుకొని అక్కడే కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నారు.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.