Goda badi : గోడ బడి గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Goda badi : గోడ బడి గురించి ఎప్పుడైనా విన్నారా? దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Goda badi : సర్కారు బడి.. ప్రైవేటు బడి పేరు విన్నాం కానీ.. ఈ గోడ బడి ఏంది? అంటారా? అవును.. దీని పేరు గోడ బడి. మామూలుగా స్కూల్ లో బోర్డు మీద ఏదైనా రాస్తూ పాఠాలు చెబుతుంటారు మాస్టార్లు. కానీ.. ఈ గోడ బడి ప్రత్యేకత ఏంటంటే.. తెల్లగా ఉన్న గోడ మీద విద్యార్థులు నేర్చుకోవాల్సిన వన్నీ ముందే రాసేస్తారు. ఇక అవి పర్మినెంట్ గా అక్కడే ఉంటాయి. వాటిని రోజూ పిల్లలకు నేర్పిస్తారు. […]

 Authored By jagadesh | The Telugu News | Updated on :28 July 2021,8:20 pm

Goda badi : సర్కారు బడి.. ప్రైవేటు బడి పేరు విన్నాం కానీ.. ఈ గోడ బడి ఏంది? అంటారా? అవును.. దీని పేరు గోడ బడి. మామూలుగా స్కూల్ లో బోర్డు మీద ఏదైనా రాస్తూ పాఠాలు చెబుతుంటారు మాస్టార్లు. కానీ.. ఈ గోడ బడి ప్రత్యేకత ఏంటంటే.. తెల్లగా ఉన్న గోడ మీద విద్యార్థులు నేర్చుకోవాల్సిన వన్నీ ముందే రాసేస్తారు. ఇక అవి పర్మినెంట్ గా అక్కడే ఉంటాయి. వాటిని రోజూ పిల్లలకు నేర్పిస్తారు. అదే గోడబడి. ఈ గోడ బడి ఎక్కడ ఉందో తెలుసా? తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలంలో ఉన్న మొర్రిగూడ అనే గ్రామంలో.

telangana godabadi initiated by kumram bheem asifabad police

telangana godabadi initiated by kumram bheem asifabad police

ఆ గ్రామంలో ఎక్కువగా ఆదివాసీలు నివసిస్తుంటారు. ఆదివాసీలు అంటేనే ఎంతో వెనుకబడి ఉంటారు తెలుసు కదా. ఆ గ్రామం కూడా ఎక్కడో అడవిలో ఉంటుంది. అక్కడ సౌకర్యాలు చాలా తక్కువ. ఆ ఊళ్లో కనీసం నెట్ వర్క్ కూడా రాదు. ఫోన్ లో సిగ్నల్ కూడా రాదు. కరోనా కాలంలో ఆన్ లైన్ క్లాసులు వినాలంటే ఆ ఊరిలోని పిల్లలకు చాలా ప్రాబ్లమ్ అయింది. ఆ సమస్య నుంచి పుట్టిందే ఈ గోడ బడి.

Goda badi : ఇంతకీ గోడ బడి ప్రయోగం సక్సెస్ అయిందా?

గోడ బడి అనే ఆలోచన వచ్చింది ఒక పోలీసుకు. అవును.. తిర్యాణి ఎస్సై రామారావుకు ఈ ఐడియా వచ్చింది. ఆయన చొరవతోనే ఆ ఊళ్లో గోడ బడి ఏర్పాటు అయింది. ఆ గూడెంలో మెయిన్ సెంటర్ లో ఉన్న గోడలకు తెల్లని పెయింట్ వేసి.. పిల్లలు చదువుకునే ముఖ్యమైన విషయాలను అక్కడ రాయించారు. తెలుగు, ఇంగ్లీష్ అక్షరమాలలు, గుణింతాలు, అంకెలు.. ఇలా.. పిల్లలు ఆ వయసులో నేర్చుకోవాల్సిన వన్నింటినీ ఆ గోడల మీద రాయించారు.

telangana godabadi initiated by kumram bheem asifabad police

telangana godabadi initiated by kumram bheem asifabad police

ఎందుకంటే.. పిల్లలు స్కూళ్లకు వెళ్లి సంవత్సరం దాటింది. మళ్లీ ఎప్పుడు స్కూళ్లు తెరుస్తారో కూడా తెలియదు. అందుకే.. వాళ్లు నేర్చుకున్న పాఠాలు మరిచిపోకుండా ఉండేందుకు.. వాళ్లు పైతరగతులకు వెళ్లినప్పుడు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు.. అలా గోడబడి ఏర్పాటు చేసి.. ఆ గూడెంలోని యువకులు, యువతులతో పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు.

అలా ఒక్క ఆ గూడెంలోనే కాదు.. ఆ గూడెం పక్కనే ఉన్న మిగితా ఆదివాసీల గూడేలలోనూ ఇలాంటి గోడ బడులను ఆ ఎస్సై ఏర్పాటు చేయించారట. ముందు అక్కడ సక్సెస్ కావడంతో మిగితా ఆదివాసీల ప్రాంతాల్లో ఏర్పాటు చేయించి పిల్లలకు పాఠాలు చెప్పిస్తున్నారు. ఆన్ లైన్ లో క్లాసులు వినలేని పిల్లలంతా.. ఉదయం లేవగానే గోడ బడి వద్దకు చేరుకొని అక్కడే కూర్చొని పాఠాలు నేర్చుకుంటున్నారు.

jagadesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది