Left Over Rice : ఎవరి కిచెన్ లో చూసినా.. రాత్రి పూట కొంచెం అయినా అన్నం మిగులుతుంది. అలా మిగిలిన అన్నాన్ని ఉదయం లేవగానే కొందరు తింటుంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా.. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని.. చాలామంది ఆ అన్నాన్ని తినేస్తుంటారు. కడుపులో పడేస్తే పోలా అని ఉదయం పూట ఏదుంటే అది.. ఇంత పెరుగో.. లేక పచ్చడో.. లేక రాత్రి పూట మిగిలిన కూరో వేసుకొని తినేస్తారు. బ్రేవ్ తీస్తారు.
అసలు.. రాత్రి పూట మిగిలిన అన్నాన్ని తినొచ్చా? రాత్రి పూట మిగిలిన అన్నం ఉదయం పూట మంచిగా ఉంటుందా? లేక పాడవుతుందా? దాన్ని తింటే ఏమౌతుంది.. అనే విషయాలు చాలామందికి తెలియదు. ఏదో తినేస్తారు కానీ.. అసలు రాత్రి పూట మిగిలిన అన్నాన్ని తింటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రాత్రి పూట మిగిలిన అన్నంలోకి ఉదయం వరకు బాక్టీరియా చేరుతుంది. రాత్రి నుంచి ఉదయం వరకు ఆ అన్నం అలాగే ఉంటుంది. కనీసం 10 గంటలు ఆ అన్నం వంటింట్లోనే అలాగే ఉండటం, అలాగే.. రాత్రి పూట వేడి ఎక్కువగా ఉంటే.. ఉదయం లేచేసరికి.. ఆ అన్నంలో బాక్టీరియా ఫామ్ అవుతుంది. ఆ బాక్టీరియా ఉన్న అన్నాన్ని తిన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది.
అందుకే.. మిగిలిపోయిన అన్నాన్ని ఉదయం తినకూడదు అని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఫుడ్ పాయిజనింగ్ ప్రతిసారి కాకపోయినా.. ఎప్పుడో ఒకసారి మాత్రం ఫుడ్ పాయిజన్ అవుతుందట. ఎందుకంటే.. కిచెన్ ఉష్ణోగ్రత పెరిగితే.. బాక్టీరియా ఎక్కువగా తయారవుతుందట. దాని వల్ల.. ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది. చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నిజానికి.. అన్నం వండగానే.. రెండు గంటల లోపు తినేయాలి. ఒకవేళ తినడం లేట్ అయితే కొంత సేపు ఫ్రిజ్ లో పెట్టొచ్చు. అది కూడా ఎక్కువ సేపు ఫ్రిజ్ లో పెట్టకూడదు. అలాగే.. రాత్రి పూట ఫ్రిజ్ లో పెట్టి కూడా ఉదయం పూట తినకూడదు. ఫ్రిజ్ లో పెట్టి మరుసటి రోజు ఏం తినకూడదు. అప్పటికప్పుడు ఒక గంట, రెండు గంటల కోసం మాత్రమే ఫ్రిజ్ లో పెట్టాలి. అలాగే.. అన్నాన్ని చాలామంది వేడి చేసి తింటారు. ఒకసారి అన్నాన్ని వండాక.. మళ్లీ వేడి చేయకూడదు. ఇవన్నీ బాధలు పడే బదులు.. ఎప్పటికప్పుడు తాజాగా అన్నాన్ని వేడి వేడిగా వండుకొని తినేయండి. ఆరోగ్యంగా ఉండండి.
ఇది కూడా చదవండి ==> మామూలోడు కాదు.. అన్నం తినడం ఆపేసి 9 నెలల్లో 60 కిలోలు తగ్గాడు.. ఆయన డైట్ లో ఉన్న ఫుడ్ ఇదే..!
ఇది కూడా చదవండి ==> రోజూ పెరుగు తింటే బరువు పెరుగుతారా? బరువు తగ్గాలంటే ఏం చేయాలి?
ఇది కూడా చదవండి ==> శపించే మొక్కను చూశారా ఎప్పుడైనా? ఈ మొక్క ఆకులను ముట్టుకుంటే ఆత్మహత్య చేసుకోవాల్సిందే?
ఇది కూడా చదవండి ==> ఈ చెట్టు ఎన్ని రోగాలను నయం చేస్తుందో తెలుసా? ఈ చెట్టు ప్రత్యేకత ఏంటంటే?
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
This website uses cookies.