KCR : కేసీఆర్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తెలంగాణ గవర్నర్
KCR : బీఆర్ఎస్ పార్టీ ఇటీవల ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలుసు కదా. ఈ సభలో మొత్తం దేశంలోనే ఉన్న గవర్నర్ల వ్యవస్థపై వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు కామెంట్స్ చేశారు. దానిపై తెలంగాణ గవర్నర్ తమిళిసై స్పందించారు. వాళ్లు చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. సీఎం కేసీఆర్.. గవర్నర్ ను పూర్తిగా అవమానించారని ఆమె అన్నారు. రాజ్ భవన్ లో ప్రధాని నరేంద్ర మోదీ రచించిన ఎగ్జామ్ వారియర్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన తర్వాత మీడియాతో ఆమె మాట్లాడారు.
మీరు ముఖ్యమంత్రులు.. గవర్నర్ల వ్యవస్థను అవమానిస్తారు. ప్రోటోకాల్ కు సంబంధించి నేను చాలాసార్లు మాట్లాడాను. కానీ.. సీఎం కేసీఆర్ స్పందించలేదు. ఒకవేళ కేసీఆర్ స్పందిస్తే.. అప్పుడే ప్రభుత్వం అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతా. జనవరి 26న జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల విషయంలో నాకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు.. అంటూ తమిళిసై స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థపై ఎలా విమర్శలు చేస్తారు.. అంటూ గవర్నర్ తమిళిసై సీరియస్ అయ్యారు. అయితే..
KCR : రాజ్యాంగబద్ధమైన వ్యవస్థపై ఎలా విమర్శలు చేస్తారు?
గత కొంత కాలంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య సఖ్యత కుదరడం లేదు. ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. తమకు తెలియకుండా ఎలా పర్యటనలు చేస్తారు.. అంటూ ప్రభుత్వం తమిళిసై పై మండిపడిన విషయం తెలిసిందే. పలు శాఖలపై కూడా ఆమె ప్రభుత్వానికి తెలియకుండా సమీక్షలు చేశారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాల్లో గవర్నర్ ను ప్రభుత్వం ఆహ్వానించలేదు. అలాగే ఇప్పటికీ అది కంటిన్యూ అవుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలంగాణలో గవర్నర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలపై ఆమె పై విధంగా స్పందించారు.