Telangana High Court : ‘ తాళం పగల గొట్టండి ‘ హైకోర్టు సంచలన ఆదేశాలు !
Telangana High Court : చాలా రోజుల నుంచి ఈ అంశం పెండింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల వివాదం ఇప్పుడు తెలంగాణ హైకోర్టులో ఉంది. దీనిపై తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2018 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపిక అవడంపై ప్రస్తుతం వివాదం నెలకొన్నది. ఆయన ఎన్నిక చెల్లదు అంటూ ప్రతిపక్షాలు చాలా రోజుల నుంచి విమర్శిస్తున్నాయి.
ధర్మపురి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్ దీనిపై హైకోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా ఈ కేసుపై హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎన్నికలకు సంబంధించిన వీవీ ప్యాట్ల సమాచారం తమకు ఇవ్వాలని లక్ష్మణ్ హైకోర్టును కోరగా.. ఆ సమాచారం ఆయనకు ఇవ్వాలంటూ రిటర్నింగ్ అధికారిని కోర్టు ఆదేశించింది. అయితే.. అవన్నీ స్ట్రాంగ్ రూమ్ లో ఉండటంతో ఆ స్ట్రాం రూమ్ గది తాళాలు ఎక్కడో పోయాయి.
Telangana High Court : స్ట్రాంగ్ రూమ్ తాళం పగులగొట్టేయండి
స్ట్రాంగ్ రూమ్ తాళాలు లేకపోవడంతో దాన్ని తెరవలేకపోయామని జిల్లా కలెక్టర్ కోర్టుకు చెప్పడంతో స్ట్రాంగ్ రూం సీల్ పగులగొట్టేందుకు జగిత్యాల కలెక్టర్ కు కోర్టు అనుమతి ఇచ్చింది. కాకపోతే అన్ని పార్టీల నేతల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ను తెరవాలని సూచించింది. తాళం తెరిచే వాళ్ల సాయం తీసుకోవాలని కోర్టు తెలిపింది. దీనికి సంబంధించి తదుపరి విచారణను ఏప్రిల్ 24కు కోర్టు వాయిదా వింది. దీంతో త్వరలోనే స్ట్రాంగ్ రూమ్ తాళాన్ని కలెక్టర్ పగులగొట్టి.. ఆ సమాచారాన్ని కాంగ్రెస్ నేత లక్ష్మణ్ కు ఇవ్వనున్నారు.