FIRST AND SECOND YEAR EXAMS : నేటి నుంచి ఇంటర్ పరీక్షల దరఖాస్తులు.. చివరి తేదీ ఎప్పుడంటే..?
FIRST AND SECOND YEAR EXAMS : తెలంగాణలో ఇంటర్ మొదటి, రెండో ఏడాది పరీక్షల దరఖాస్తులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్ విద్యార్థులంతా ఈ నెల 24 వరకు ఫీజు చెల్లించాని ఇంటర్ బోర్డు తెలిపింది. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించని వారికి.. ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 21 వరకు మరో అవకాశం ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు.
గడువు పూర్తయిన అనంతరం… ఈనెల 25 నుంచి 31 వరకు- రూ.500 ఆలస్య రుసుముతో, ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు- రూ.1000 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు- రూ.2 వేలతో ఫిబ్రవరి 15 నుంచి 21 వరకు ఫీజు చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు. రూ. 100 కట్టి గత ఏడాది పరీక్షలకు ఇంప్రూవ్మెంట్

TELANGANA INTER FIRST AND SECOND YEAR EXAM FEE DATES
రాసుకోవచ్చునని బోర్డు పేర్కొంది. మొదటి సంవత్సర పరీక్షల్లో ఇటీవల వెలువడిన ఫలితాల్లో అధిక శాతం మంది ఫెయిల్ కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థులందరనీ పాస్ చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు గతంలో ప్రకటించింది.