Junior Panchayat Secretary : పంచాయతీ కార్యదర్శులకు తీపి కబురు.. పెరిగిన జీతాలు
Junior Panchayat Secretary : తెలంగాణలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వాళ్లకు శుభవార్త చెప్పింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల జీతాలను పెంచుతున్నట్టు ప్రకటించింది. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ప్రస్తుతం వేతనం 15 వేల రూపాయలు ఉండగా.. దాన్ని 28,719 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా జారీ చేసింది.

telangana junior panchayat secretary employees salary hike
జులై 1 వ తారీఖు నుంచే పెరిగిన జీతాలు అమలులోకి రానున్నాయి. అంటే.. ఆగస్టు 1న పెరిగిన వేతనం ఉద్యోగుల అకౌంట్ లో పడనుంది. అయితే.. పంచాయతీ సెక్రటరీల ప్రొబేషన్ సమయాన్ని మాత్రం ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం వాళ్లకు మూడు ఏళ్ల వరకు ఉన్న ప్రొబేషన్ పీరియడ్ ను.. నాలుగేళ్లకు పెంచుతూ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొన్నది. ప్రభుత్వం తమ వేతనాలను పెంచడంతో.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.