తెలంగాణ మొత్తం ఆ మంత్రి గురించే మాట్లాడుతున్నారు – ఆయనకి ఏమైంది, ఎక్కడున్నాడు?

Authored By Jagadesh Gatla | The Telugu News | Updated on : 2 January 2021, 9:45 am

అవును.. ప్రస్తుతం తెలంగాణలో ఒకటే హాట్ టాపిక్. ఉన్నట్టుండి ఆ మంత్రి కనిపించకపోవడం. ఈయన ఒక్కరే కాదు మరికొందరు టీఆర్ఎస్ నేతలు కూడా కనిపించడం లేదు. దానికి కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కొందరు టీఆర్ఎస్ నేతలైతే బయటికే రావడం మానేశారు. కొందరైతే హైకమాండ్ తో టచ్ లో కూడా లేరట. ఏంటో.. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందో? చివరకు కొందరు మంత్రులు కూడా సైలెంట్ అయిపోయి.. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదట.

telangana minister etela rajender is missing

telangana minister etela rajender is missing

ఈటెల రాజేందర్ కూడా సైలెంట్?

అందులో ముఖ్యమైన నేత ఈటెల రాజేందర్. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ కాలం నుంచి ఉన్న నేత. సీఎం కేసీఆర్ కు కూడా అత్యంత సన్నిహితుడు ఈటెల. కానీ.. ఏమైందో కానీ.. ఈటెల రాజేందర్ ప్రస్తుతం సైలెంట్ అయిపోయారు. అసలు బయట కూడా కనిపించడం లేదు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు.. కరోనా సమయంలో మీడియాలో ప్రముఖంగా కనిపించిన వ్యక్తి.. ఈ ఎన్నికల తర్వాత జాడ లేకుండా పోయారు.

telangana minister etela rajender is missing

telangana minister etela rajender is missing

సీఎం కేసీఆర్ మీద కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా… అదే జిల్లాకు చెందిన ఈటెల మాత్రం బండి సంజయ్ పై ఎదురుదాడి చేయడం లేదు. ఏమాత్రం స్పందించడం లేదు. ఇలా.. ఈటెల ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయిపోయారు.. అనే విషయం టీఆర్ఎస్ హైకమాండ్ కు కూడా అంతుపట్టడం లేదట. ఏంటో.. టీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోందో ఏమో? భవిష్యత్తులో ఇంకెన్ని విచిత్రాలు జరుగుతాయో?

Advertisement

Jagadesh Gatla

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి