KTR : ఈ ఫోటోలో చిన్ననాటి కేటీఆర్ ను గుర్తుపట్టండి చూద్దాం.. కేటీఆర్ చిన్నప్పటి ఫోటో వైరల్..!
KTR : మంత్రి కేటీఆర్ గురించి తెలుసు కదా. సీఎం కేసీఆర్ కొడుకు అయినప్పటికీ.. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆయన ఎంతో పాటుపడ్డారు. కరోనా కాలంలో కూడా ఎంతో మందికి ఎన్నో రకాలు సాయం అందించారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అవసరమైన వారికి సాయం చేస్తుంటారు. కేటీఆర్ రూటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన రాజకీయాల్లో అయినా సరే.. సేవా కార్యక్రమాల్లో అయినా సరే ముందుంటారు. తమకు ఈ కష్టం వచ్చింది అంటే వెంటనే తన టీమ్ ను పంపించి.. తగిన సాయం అందించడంలోనూ ముందుంటారు. అందుకే.. కేటీఆర్ అంటే తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం.
telangana minister ktr childhood photo goes viral
సోషల్ మీడియాలో సేవా కార్యక్రమాల గురించే కాక.. అప్పుడప్పుడు తన పర్సనల్ లైఫ్ ను కూడా కేటీఆర్ ఎక్స్ ప్లోర్ చేస్తుంటారు. తన మెమోరబుల్ మూమెంట్స్ ను కూడా అప్పుడప్పుడు కేటీఆర్ షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా కేటీఆర్ ఓ ఫోటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అది తన చిన్ననాటి ఫోటో. తన చిన్నప్పుడు నాలుగో తరగతి చదివే సమయంలో తన క్లాస్ మెట్స్ తో కలిసి దిగిన ఫోటో అది.
KTR : భరత్ అనే తన క్లాస్ మెట్.. కేటీఆర్ కు పంపించారట
నాలుగో తరగతి సమయంలో తన టీచర్స్ తో కలిసి వాళ్లంతా కలిసి దిగిన ఫోటో అది. ఆ ఫోటోను షేర్ చేసిన కేటీఆర్.. 1984 వ సంవత్సరం నాటి ఫోటో అది అంటూ ట్వీట్ చేశారు. భరత్ అనే నా క్లాస్ మేట్ నాకు ఈ ఫోటోను పంపించాడు. కరీంనగర్ లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ లో 4 వ తరగతి చదువుతున్నప్పటి ఫోటో అది. ఆ ఫోటోను చూశాక.. ఆ ఫోటోలో ఉన్నవాళ్లందరి పేర్లు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.. అంటూ ఆ ఫోటోను షేర్ చేశారు కేటీఆర్.
telangana minister ktr childhood photo goes viral
కేటీఆర్ ఆ ఫోటోను షేర్ చేశారో లేదో.. ఆ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ఫోటోలో మీరు ఎక్కడున్నారు కేటీఆర్.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. ఆ ఫోటోలో కేటీఆర్ ఎక్కడున్నారో మాత్రం చెప్పలేదు. మీకు ఏమైనా తెలిసిందా? కేటీఆర్ ఆ ఫోటోలో ఎక్కడున్నారో కనిపెట్టండి చూద్దాం.
