Telangana RTC : తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇది నిజమే.. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అనేక సందేహాలు ఉన్నాయి. ఎవరెవరికి ఉచిత బస్సు ప్రయాణం ఉచితంగా ప్రయాణించవచ్చా.. ఎన్ని కిలోమీటర్ల వేరు ఉచితంగా ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయాణించొచ్చు. ఇలా అనేక సందేహాలు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఉన్నాయి. ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకం కర్ణాటక రాష్ట్రంలో ఎటువంటి ఫలితాలను ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది. మహిళలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం కలిసి వస్తుందా.. దీనివల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా.. మీరంతా వివరంగా తెలుసుకోబోతున్నారు. తాము గనక అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తాము అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అనేది మొదలవుతుంది. రేవంత్ రెడ్డి చేతులు మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.
పల్లె వెలుగు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ సర్వీస్ లో మహిళలందరికీ ఉచిత ప్రయాణం ఉంటుంది. మహిళలు చిన్నపిల్లలు ట్రాన్స్ జెండర్లు అందరికీ కూడా ఈ ఉచిత ప్రయాణం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సహకరించాలని అధికారి యంత్రాంగం కూడా పత్రికా ప్రకటనల్లో కోరడం జరిగింది. ఈ డిసెంబర్ 9 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టిఎస్ఆర్టిసి ప్రకటించింది. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్ సర్వీసులో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించే వ్యక్తులు వెల్లడించింది. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లో మాత్రమే ఉచిత ప్రయాణం వర్తిస్తుంది అని తెలిపింది. మహిళలతో పాటు బాలికలు విద్యార్థినులు థర్డ్ జెండర్లు కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చునని పేర్కొంది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం గురించి ఉన్నతాధికారులతో టిఎస్ఆర్టిసి ఎండి సజ్జనర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న ప్రతి మహిళ ఈ సదుపాయిని వినియోగించుకోవచ్చా.. అంటే కాదనే చెప్పాలి.
ఎవరైతే తెలంగాణ రాష్ట్ర స్థానికత కలిగి ఉన్నారో అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం అనేది వర్తిస్తుంది. హైదరాబాద్లో ఎక్కువ మంది వివిధ రాష్ట్రాల వారు ఉంటారు. ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళు ఉంటారు. కర్ణాటక లేదంటే మహారాష్ట్ర తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల వాళ్ళు అక్కడ ఉంటారు. అందరికీ తెలంగాణ స్థానికత ఉంటుందంటే ఉండదనే చెప్పాలి. వాళ్ళ సొంత ఊరిలో వాళ్ళ ఐడెంటిటీ వాళ్లకు సంబంధించినటువంటి ఆధార్ కార్డులు గానీ మిగతావన్నీ అక్కడ ఉంటాయి. ఇక్కడ మాత్రం పని చేసుకుంటారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కాదు. తెలంగాణ రాష్ట్ర స్థానికత ఉన్న మహిళలందరికీ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. అంటే మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అనేటువంటి ప్రూఫ్ ని కచ్చితంగా ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చూపించాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.