Categories: NewsTelangana

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధం .. ఓటర్ జాబితా సవరణపై షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 29న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా, గ్రామ పంచాయితీల ఓటర్ జాబితా సవరణకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

#image_title

తాజా ప్రకటనల ప్రకారం ఆగస్టు 28న ఫోటోలతో కూడిన ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు.ఆగస్టు 29న జిల్లా స్థాయిలో, 30న మండల స్థాయిలో రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలతో సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది.ఆగస్టు 28 నుంచి 30 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు.

ఆగస్టు 31న వచ్చిన అభ్యంతరాలను పరిష్కరిస్తారు.సెప్టెంబర్ 2న తుది ఓటర్ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలుపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది. అదే సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా గవర్నర్‌కు పంపింది.అయితే, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ పరంగా మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ఈ నెల 29న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలుపై కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

Recent Posts

Ghee Vs Butter | నెయ్యి Vs వెన్న: ఆరోగ్యానికి ఏది మంచిది? .. నిపుణుల సమాధానం ఇదే!

Ghee Vs Butter | భారతీయ వంటకాలలో నెయ్యి, వెన్న కీలకమైన పదార్థాలు. రోటీ, పరాఠా, పప్పు, బిర్యానీ లాంటి…

41 minutes ago

Guava leaves | జామ ఆకుల వ‌ల‌న ఎన్ని ఉప‌యోగాలు ఉన్నాయో తెలుసా.. వింటే అవాక్క‌వుతారు!

Guava leaves | జామపండు రుచికరంగా ఉండటమే కాదు, దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.…

2 hours ago

Coconut Water | కొబ్బ‌రి నీళ్లు వారో తాగారో అంతే.. ఈ విష‌యం త‌ప్ప‌క తెలుసుకోండి..!

Coconut Water | కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. దీనిలో ఉండే ప్రాకృతిక ఎలక్ట్రోలైట్లు,…

3 hours ago

Pumpkin Seeds | మీ బాడీలో కొవ్వుని క‌రిగించే దివ్య ఔష‌దం.. ప‌చ్చ‌గా ఉన్నాయ‌ని ప‌డేయ‌కండి..!

Pumpkin Seeds | ఇప్పటి కాలంలో పని ఒత్తిడి, తప్పుడు జీవనశైలి, శారీరక శ్రమలేని జీవితం కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు…

4 hours ago

Shani Dosha | మీకు శ‌ని దోషం ఉందా.. అది పోవాలంటే ఏం చేయాలి అంటే..!

Shani Dosha | శని దోషంతో బాధపడేవారు శనివారం ఉపవాసంతో శివుడి మరియు హనుమంతుని పూజ చేయాలి. శివలింగానికి ఆవుపాలు,…

5 hours ago

Google Pixel 10 | గుడ్ న్యూస్.. శాటిలైట్ ద్వారా వాట్సాప్ కాల్ చేసే అవ‌కాశం.. అదిరిపోయే ఫీచ‌ర్

Google Pixel 10 | గూగుల్ పిక్సెల్ అభిమానులకు గుడ్ న్యూస్. ఇక నుండి వాట్సాప్ కాల్స్ (Google Pixel…

19 hours ago

Lord Ganesha | వెయ్యి కిలోల చాక్లెట్స్‌తో కొలువుదీరిన గ‌ణనాథుడు.. ఎక్క‌డో తెలుసా?

Lord Ganesha | ఈ ఏడాది గణేశ్ చతుర్థిను కాకినాడ జిల్లా భక్తులు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. పర్యావరణహిత మార్గాల్లో వినాయక విగ్రహాలను…

20 hours ago

Heavy Rains | బంగాళాఖాతంలో అల్పపీడనం.. వినాయ‌క క‌మిటీల‌కి ప్ర‌త్యేక సూచ‌న‌లు

Heavy Rains | ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ…

21 hours ago