TG Govt | ఇందిరమ్మ ఇళ్లకు భారీ ఊరట .. నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TG Govt | ఇందిరమ్మ ఇళ్లకు భారీ ఊరట .. నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం

 Authored By sandeep | The Telugu News | Updated on :24 September 2025,4:00 pm

TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది. అర్హులైన ప్రతి గృహలేని కుటుంబానికి సొంత ఇంటిని కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఈ పథకానికి రాష్ట్ర సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల నగదు సహాయంతోపాటు ఇప్పుడు ఉపాధి హామీ ద్వారా 90 రోజుల పని దినాలు కల్పించనున్నారు.

#image_title

గొప్ప నిర్ణయం..

అంటే జాబ్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ పనుల్లో స్వయంగా పాల్గొని, రోజుకు వేతనం పొందే అవకాశం లభించనుంది. దీని వల్ల ఇంటి నిర్మాణ వ్యయం తగ్గుతుంది, కూలి లాభం రూపంలో అదనపు ఆదాయం లభిస్తుంది. నిర్మాణం వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. బేస్‌మెంట్‌కు 40 రోజులు, పైకప్పుకు 50 రోజులు – మొత్తం 90 రోజుల పని క‌ల్పిస్తారు.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక మార్గదర్శకాల ప్రకారం బేస్‌మెంట్ వరకు నిర్మాణానికి 40 పని దినాలు, పైకప్పు పనులకు మరో 50 పని దినాలు, మొత్తం: 90 రోజుల ఉపాధి ల‌భిస్తుంది. జాబ్ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఈ రోజులు నేరుగా కేటాయించనున్నారు. నైపుణ్యం లేని ఉపాధి హామీ కూలీలు కూడా ఈ నిర్మాణాల్లో పాల్గొనవచ్చు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబానికి ఆర్థికంగా మేలు కలిగించడమే కాక, ఉపాధి హామీ కూలీలకు కూడా ఉపాధి లభిస్తుంది.

Tags :

    sandeep

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది