Ys Jagan : మన పథకాలు దేశానికి ఆదర్శం.. హామీ ఇవ్వని పథకాల అమలు
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరియు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి అంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందని, దేశంలో మరెక్కడా లేని విధంగా జరుగుతున్న సంక్షేమ పథకాల అమలు తో సామాన్య ప్రజలకు చాలా లబ్ది చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో పలు రాష్ట్రాలు మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఇవ్వాలనే ఉద్దేశంతో పరిశీలిస్తున్నారని కూడా మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రతి సంక్షేమ పథకం కూడా జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క డ్రీమ్ అంటూ మంత్రి తెలియజేశారు. ప్రతి సంక్షేమ పథకం కూడా నేరుగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని.. అదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లక్ష్యం అన్నారు. ఇప్పటికే జగన్ మూడు సార్లు బెస్ట్ సీఎం గా జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారని, ఆయన రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తారు అంటూ మంత్రి తెలియజేశారు.రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా మహిళా సంఘాలు గుర్తించి వారికి రుణాలు ఇవ్వడం ద్వారా మహిళల యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రతి వర్గం వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని, కనుక వచ్చే ఎన్నికల్లో వైకాపా మళ్లీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా వచ్చే ఎన్నికల్లో కనీసం వారికి సింగిల్ డిజిట్ ఎమ్మెల్యే స్థానాలు కూడా దొరకడం కష్టమే అన్నట్లుగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను మరియు సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతామని అన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.