Ambassador Car : మళ్లీ అంబాసిడర్ వచ్చేస్తోంది… అదిరిపోయే లుక్ తో ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి..
Ambassador Car : మార్కెట్ లోకి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా అంబాసిడర్ కార్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇప్పటికీ ఈ కారును ఇష్టపడేవారు ఉన్నారు. కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్ గా పిలిచే ఈ కారును పొలిటీషిన్స్, సెలబ్రెటీలు ఎక్కవగా యూస్ చేసేవాళ్లు. అయితే కొంత కాలంగా ఈ కార్లు తయారీ ఆగిపోయింది. కాగా ఇప్పుడు సరికొత్త మోడల్ గా అంబాసిడర్ ను మళ్లీ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. హిందుస్తాన్ మోటర్స్ ప్యూజట్ సంస్థతో ఒప్పందం చేసుకుని ఎలక్ట్రిక్ కారును తయారు చేసే పనిలో పడ్డాయి. 1956 నుంచి దేశంలో ఈ కార్లు తయారవుతుండేవి.
బ్రిటీష్ మోడల్ కార్ ఆధారంగా తయారైనప్పటికీ దీన్ని ఇండియన్ కారుగానే భావిస్తారు. 1960-90 వరకు అంబాసిడర్ కారు కలిగి ఉండటాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా చూసేవాళ్లు. ఎన్ని కొత్త మోడల్స్ మార్కెట్లోకి వచ్చినా దీని క్రేజ్ తగ్గలేదు. అయితే ఆ తర్వాత కాలంలో మరో కార్ల తయారీ సంస్థ కార్లకు డిమాండ్ పెరగడంతో అంబాసిడర్ కార్ల అమ్మకాలు తగ్గాయి. దీంతో హిందుస్తాన్ మోటార్స్ సంస్థ నష్టాల్లోకి వెళ్లిపోయింది. కాగా హిందుస్థాన్ మోటార్స్ కు చెన్నై, పశ్చిమబెంగాల్ లోని ఉత్తరపరలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉండేవి. వీటిలో చెన్నై ప్లాంట్ లో మిత్సుబిషి కార్లను తయారు చేయగా..
Ambassador Car : అంబాసిడర్ క్రేజ్ ఎప్పటికీ తగ్గదు..
ఉత్తరపర ప్లాంట్ లో అంబాసిడర్ మరియు ఇతర చిన్న తరహా వాణిజ్య వాహనాలను తయారు చేసేవారు. అయితే నష్టాల కారణంగా 2014 నుంచి కార్ల తయారీ, అమ్మకాలు సదరు సంస్థ నిలిపివేసింది. 2017లో కంపెనీలోని వాటాలను ప్యూజట్ సంస్థకు రూ.80 కోట్లకు విక్రయించింది.ఇప్పుడు అదే సంస్థతో కలిసి కొత్త కారును తయారు చేస్తున్నారు. మరో రెండేళ్లలో అంబాసిడర్ 2.0 భారతీయ రోడ్లపై దూసుకుపోనుంది. అలాగే ఎలక్ట్రిక్ బైకులను కూడా హిందుస్తాన్ మోటార్స్ తయారు చేస్తోంది. త్వరలోనే ఇవి కూడా రోడ్లపైకి రానున్నాయి. కాగా ఈ కారుకుసంబంధించిన ఫొటోలు కొన్ని నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.