ఆమె మొదటి పెళ్లి ఫెయిల్ .. రెండో పెళ్లి చేసుకుంటే భర్త అక్రమ సంబంధం.. చివరకి ఆమె ఇలా చేసిందేంటీ..!!
సమాజంలో పరిస్థితులు చాలా హీనాతిహీనంగా మారిపోయాయి. ముఖ్యంగా భార్య భర్తల బంధం ఉన్నా కొద్ది బలహీన పడుతూ ఉంది. చాలామంది అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న వ్యక్తులను కాటికి చేర్చేస్తున్నారు. ఇదిలా ఉంటే బెంగళూరులో ఓ గృహిణి మొదటి రాతలో పెళ్లి జీవితం సరిగ్గా లేనట్టు పరిస్థితులు మారి ఆమె చివరాఖరికి బలవన్మరణానికి పాల్పడింది. వీది అంతలా వెంటాడి మరి ఆమె ప్రాణాలు పోయేలా చేసింది. విషయంలోకి వెళ్తే బెంగళూరులో ఓ పవిత్ర అనే గృహిణి మొదట పెళ్లి చేసుకోవడం జరిగింది.
అయితే ఆ పెళ్లి కొన్ని కారణాలవల్ల పెటాకులు అయింది. మొదట భర్తకు విడాకులు ఇచ్చి తర్వాత చేతన్ గౌడను పవిత్ర రెండో వివాహం చేసుకుంది. చేతన్ సుముక్ మర్చంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను నడుపుతున్నాడు. అందులోనే పని చేస్తుంది పవిత్ర. పెళ్లి చేసుకున్న కొద్ది నెలలు బాగానే ఉన్నా.. రెండో భర్త చేతన్ సుముక్ కంపెనీలో పనిచేస్తున్న మరో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ విషయం అదే కంపెనీలో పని చేస్తున్న భార్య పవిత్ర కి తెలియడంతో.. చాలాసార్లు చేతన్ గౌడని.. మందలించటం జరిగింది.
అయితే ఇద్దరి మధ్య ఈ అక్రమ సంబంధం వల్ల భయంకరమైన గొడవలు జరగడంతో పవిత్ర మనస్థాపానికి చెంది ఒక సూసైడ్ లెటర్ వాట్సాప్ ద్వారా పుట్టింటికి పంపించి ఉరి వేసుకుని చనిపోయింది. తాను మృతి చెందటానికి గల కారణాలను కూతురు పంపించిన వాట్సాప్ ఆధారంగా తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు. చేతన్ గౌడ్, అతడి ప్రేయసిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వారి నుండి రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.