చనిపోతున్న భార్య కోరిక తీర్చిన భర్త.. ఆనందంతో పొంగిపోయిన భార్య.. కానీ ఆ తర్వాత..
చాలామంది చనిపోయేలోపు ఇది చూడాలి.. అక్కడికి వెళ్లాలి.. ఇది చేయాలి.. అది చేయాలి అని ఇలా ఓ కోరిక బలంగా ఉంటుంది. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా పదే పదే చెప్తుంటారు. అయితే ఏ రోజు చివరి రోజు అవుతుందో ఎవరికీ తెలియదు. అందుకే ఏది చేయాలనుకున్నా అది వెంటనే చేసేయాలి. చాలా మంది తమ కోరికలు నెరవేర్చుకోకుండానే వెళ్లిపోతుంటారు. కొందరు మాత్రం తమకు అండగా ఉన్నవారు అర్థం చేసుకుని తాము కోరుకున్న కోరికలను నెరవేర్చుతారు. ఇప్పుడు కూడా అలాంటి ఒక సంఘటనే మనం తెలుసుకుందాం.. ఓ భర్త అనారోగ్యంతో ఉన్న తన భార్య చివరి కోరికను ఎంతో కష్టపడి నెరవేర్చాడు. అది చూసిన భార్య ఆనందంతో ఉప్పొంగిపోయింది.ప్రణాపాయ స్థితిలో ఉన్న తన భార్య చివరి కోరిక తీర్చి కనీసం ఆ సంతోషమైనా మిగిల్చానని అంటున్నాడు రమేష్ అనే వ్యక్తి.
రమేష్ భార్య పేరు అజూ.. వీళ్లకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. అయితతే అజూకి లైవ్ క్రికెట్ మ్యాచ్ స్టేడియంలో చూడాలనే కోరిక ఉండేది. అయితే ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ చాన్స్ రాలేదు. ఈ లోగా రమేష్ భార్య అనారోగ్యానికి గురైంది. రోజు రోజుకు అజూ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో డాక్టర్లు కూడా ఎక్కువ రోజులు బతికే అవకాశం లేదని తేల్చారు. ఇక అప్పుడు కనీసం తన భార్య చివరి కోరికనైనా తీర్చాలని అనుకున్నాడు. తన భార్య ఎప్పటినుంచో క్రికెట్ ని స్టేడియంలో లైవ్ లో చూడాలనే కోరికను తీర్చడానికి తీవ్ర ప్రయత్నాలు చేశాడు. అయితే తన భార్య స్టేడియానికి వచ్చి చూసే పరిస్థితి లేదు. కానీ ఎలాగైనా తన కోరికను తీర్చాలని పట్టుబట్టాడు. తన ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్లకి ఫోన్ చేసి ఎలాగోలా మ్యాచ్ కి టికెట్స్ తెప్పించుకున్నాడు.
బ్రతకదని తెలిసి.. చివరి కోరిక తీర్చడానికి..
ముందుగానే స్టేడియం దగ్గర్లో ఉన్న ఒక హాస్పటల్లో చేర్పించాడు. అలాగే స్టేడియంలోని పోలీసులకి కూడా తన పరిస్థితి చెప్పాడు. ఇక విషయం అర్థం చేసుకున్న పోలీసులు కూడా రమేశ్ కి సహాయం చేశారు. ఇలా ముందే అన్ని ఏర్పాట్లు చేసి తన భార్యని మ్యాచ్ చూడడానికి స్టేడియం తీసుకెళ్లాడు. దీంతో అజూ ఆనందానికి అవధులు లేవు. తన బాధంతా మర్చిపోయి మ్యాచ్ ని ఎంజాయ్ చేసింది. ఇక మ్యాచ్ చూసిన కొన్నాళ్లకే అజు మరణించింది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చు కాబట్టి గతాన్ని ఆలోచించకుండా ప్రస్తుతాన్ని ఆస్వాదించండిని రమేష్ ఇదంతా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం తన కొడుకుతో గడుపుతున్నాట్లు చెప్పుకొచ్చాడు. అంత రిస్క్ చేసి తన భార్య చివరి కోరికను తీర్చిన రమేశ్ ని అందరూ అభినందిస్తున్నారు.