Home » Health » The Miracle Drink Cumin Waters Health Benefits
Health

Health Tips | జీలకర్ర నీరు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..ఏకంగా 300 రోగాలకు చెక్ పెట్టొచ్చు…!

Authored By
Sam C
The Telugu News | Updated on: September 16, 2025 5:08 pm
Advertisement

Health Tips | పొట్ట ఆరోగ్యం బాగోలేకపోతే, దాని ప్రభావం మొత్తం శరీరంపైనే పడుతుంది. నిపుణుల మాటల్లో దీన్ని గట్ హెల్త్ పాడవడం అంటారు. గట్ హెల్త్ దెబ్బతింటే జీర్ణ సమస్యలతో పాటు దాదాపు 300 రకాల రోగాలకు శరీరం నిలయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, దీనికి పరిష్కారం మన వంటగదిలోనే ఉందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అదే జీలకర్ర నీరు .

Advertisement

#image_title

అద్భుతమైన ఔషధం

Advertisement

ప్రతి ఇంటి వంటగదిలో ఉండే జీలకర్ర కేవలం ఆహారానికి రుచి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధం లాంటిదని చెబుతున్నారు. జీలకర్ర నీరు తాగడం వల్ల అజీర్తి, గ్యాస్, ఉబ్బరం, బరువు పెరగడం వంటి సమస్యలు తగ్గుతాయని వైద్యులు వెల్లడిస్తున్నారు.

ఇదిఅజీర్తి, గ్యాస్ సమస్యలకు తక్షణ ఉపశమనం ఇస్తుంది. జీవక్రియ వేగవంతమవడంతో కొవ్వు కరిగి బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరంలో పోషకాలను సమతుల్యం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాత్రి పడుకునే ముందు తాగితే మంచి నిద్ర వస్తుంది. వేడి చేసిన జీలకర్ర నీరు తాగితే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. భోజనం తర్వాత ఒక గ్లాసు జీలకర్ర నీరు తాగితే అజీర్తి తగ్గుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. రాత్రి నిద్రలేమితో బాధపడేవారు పడుకునే ముందు తాగితే ఉపశమనం పొందవచ్చు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి