#image_title
Heart | ప్రస్తుత కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువతలోనూ గుండెపోటులు రావడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ అలవాట్లలో దాగి ఉన్న కొన్ని రహస్య శత్రువులే గుండె సమస్యలకు కారణమని చెబుతున్నారు. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని దెబ్బతీస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచే ముఖ్య పదార్థం. దాని లోపం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది.
#image_title
గుండెకు ముప్పు కలిగించే అలవాట్లు:
కూల్‌డ్రింక్స్, డెజర్ట్‌లు, సాస్‌లు, ప్యాకేజ్డ్ ఆహారాల్లో ఉండే చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, రక్తనాళాలలో వాపును కలిగిస్తుంది. తెల్ల రొట్టె, క్రాకర్లు, పేస్ట్రీలు శరీరంలో చక్కెరలాగే పనిచేస్తూ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. సోయాబీన్, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనెలలో అధికంగా ఉండే ఒమేగా-6 కొవ్వులు వేడి చేసినప్పుడు విషపూరిత సమ్మేళనాలుగా మారి గుండెకు హాని చేస్తాయి.
పొగాకు పొగలోని రసాయనాలు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి చేసే ఎంజైమ్‌లను నాశనం చేస్తాయి. యాంటీబ్యాక్టీరియల్ మౌత్‌వాష్‌లు నోటిలో ఉండే మంచి బ్యాక్టీరియాను చంపేస్తాయి. దీంతో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గి రక్తపోటు పెరుగుతుంది. పాలకూర, బీట్‌రూట్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, నిమ్మకాయలు, దానిమ్మ, డార్క్ చాక్లెట్ వంటి ఆహారాలు నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం, సరిపడా నిద్ర, ధ్యానం, ఒత్తిడి నియంత్రణ వంటి జీవనశైలి మార్పులు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు.
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
Facial Fact | వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…
Coriander | వంటకాలకు రుచి, సువాసనను అందించే కొత్తిమీర (Coriander) ప్రతి వంటగదిలో తప్పనిసరి పదార్థం. తాజా ఆకులు, ఎండిన గింజలు,…
Devi Navaratri 2025 | నవరాత్రి పండుగను దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ తొమ్మిది రోజుల ఉపవాసంలో భక్తులు…
This website uses cookies.