the-richest-man-on-earth-with-160-rupees-ten-thousand-crores in Lottery
Lottery : ప్రస్తుత రోజుల్లో ఓవర్ నైట్ లోనే జీవితాలు మారిపోతున్నాయి. నీతిగా నిజాయితీగా కొద్దో గొప్పో ఉన్న కొంతమంది అయినా సరే.. తగిన ప్రతిఫలాలు ఎక్కడ పొందలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ అనైతికంగా బట్టలిప్పేసి.. ఏదైనా గొడవ సృష్టించి వీడియో రూపంలో వైరల్ అయితే మాత్రం సదరు వ్యక్తి సెలబ్రిటీ అయిపోయి.. క్రేజ్ క్యాష్ గా మార్చుకుని బతికేస్తున్నారు. దీంతో సులువైన మార్గంలో ధనవంతులు కావాలని చాలామంది ఉబలాటపడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది లాటరీ ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మనదేశంలో లాటరీ నిషేధం ఉన్నాగాని విదేశాల్లో మాత్రం.. లాటరీకీ ఫుల్ డిమాండ్ ఉంది.
పెద్ద పెద్ద సంస్థలు మెగా లాటరీలు ప్రకటించగా జనాలు ఎగబడి మరీ కొంటున్నారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్ డ్రైవర్ అరబ్ కంట్రీ లో లాటరీ గెలిచీ ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగా ప్రైజ్ మనీ గెలవడం జరిగింది. ఇప్పుడు ఇదే తరహాలో 122 రూపాయలతో లాటరీ కొన్న వ్యక్తి పదివేల కోట్లు జాక్ పాట్ ఆఫర్… అందుకున్నాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నాగాని అమెరికాలోని మైన్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల మెగా మిలియన్ సంస్థ నిర్వహించిన లాటరీలో టికెట్ కొనుగోలు చేయడం జరిగింది. సదరు సంస్థ జనవరి 13వ తారీకు డ్రా చేసింది. ఈ డ్రాలో గెలిచిన టికెట్ నెంబర్ తో గెలుచుకున్న వ్యక్తి టికెట్ లోని 30,43,45,46,51(వైట్ బాల్స్), 14 (గోల్డ్ మెగా బాల్) నంబర్లు సరిపోయాయి. దీంతో నిర్వాహకులు సదరు వ్యక్తిని విజేతగా ప్రకటించారు. ఈ లాటరీలో అతనికి ఏకంగా రూ. 10,973 కోట్లు గెలుచుకున్నాడు.
the-richest-man-on-earth-with-160-rupees-ten-thousand-crores in Lottery
ఈ మొత్తాన్ని దాదాపు 29 ఏళ్ల పాటు వాయిదాల పద్ధతిలో నిర్వాహకులు అతడికి చెల్లించనున్నారు. అయితే ఒకేసారి కావాలంటే ఏడు వేల కోట్లు మాత్రమే ఇస్తామని. సదరు వ్యక్తికి.. మెగా మిలియన్స్ కంపెనీ ఆఫర్ ఇవ్వటం జరిగింది. అమెరికాలో జరిగిన ఈ సంఘటన వరల్డ్ వైడ్ గా ట్రేండింగ్ న్యూస్ అయింది. దీంతో ఆ వ్యక్తి ఓవర్ నైట్ లోనే వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. సోషల్ మీడియాలో కూడా ఈ వార్త రావటంతో భూమ్మీద అతిపెద్ద అదృష్టవంతుడు అంటూ నేటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…
Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…
This website uses cookies.