Ys jagan : వాళ్లు వైఎస్ జగన్ ను ఇరకాటంలో పడేస్తున్నారుగా..?
Ys jagan : ఏపీ రాష్ట్ర రాజకీయాలకు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి. మొన్నటికి మొన్న ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకున్నారు. తన భార్యకు అసెంబ్లీలో అవమానించారని ఆయన ఆరోపించారు. ఇలా సీనియర్ నేత అయిన చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఎంత మాత్రం సబబు కాదని దేశ వ్యాప్తంగా ఉన్న అనేక మంది నాయకులు అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాటలు మాట్లాడేటపుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ ఇష్యూ నెమ్మదిగా సద్దుమణుగుతుందనుకున్న సమయంలో జగన్ ప్రభుత్వానికి మరో చొక్కొచ్చి పడింది. అదే ఉద్యోగ సంఘాల సమస్యలు. ఉద్యోగ సమస్యలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే కరోనా కంగారు వచ్చింది. కరోనా కంగారు వలన ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. దీని వల్ల ఏపీలో కూడా అనేక మంది ఇబ్బందులు పడ్డారు. ఇలా జరగడం వలన ప్రభుత్వానికి వచ్చే పన్నులు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ సంక్షేమ పథకాలు మాత్రం అలాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మీద వరదల పిడుగు కూడా పడింది. రాయలసీమ మొత్తం భారీ వర్షాలతో అతలాకుతలం అయింది. దాదాపు ఎంత లేదన్నా ఆరు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వరద సహాయం చేస్తామని ప్రకటించినా కేంద్రం ఎంత మేరకు సహాయం చేస్తుందో తెలియదు.
Ys jagan : అవన్నీ సాధ్యమేనా?
కానీ డిసెంబర్ 1 నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పునురుద్ధరణకు చర్యలు చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడున్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో జగన్ సర్కార్ కు ఇవన్నీ చేయాలంటే పెద్ద తలనొప్పే అని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉందని ఇంకా అప్పులు తెస్తే మరింత పరిస్థితి దిగజారి పోతుందని అంటున్నారు. అప్పులు చేయకుండా ఉండాలని సూచిస్తున్నారు. మరి జగన్ సర్కార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎలా గాడిన పెడుతుందో అని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. సంక్షేమ పథకాలకే కోట్లు పెడుతున్న వేళలో రాష్ట్రానికి వచ్చిన కష్టాలను ఎలా తీర్చుతారో? అంటూ లెక్కలేసుకుంటున్నారు.