Home » Exclusive » The Wife Is Dead If The Father Knows What He Did To His Daughter The Members Of The Society Will Have To Think
Exclusive

Farooqnagar News : భార్య చచ్చిపోయింది… కూతురిని ఓ తండ్రి ఏం చేశాడో తెలిస్తే సభ్య సమాజం తలదించుకోవాల్సిందే..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: January 9, 2023, 1:40 pm
Advertisement

Farooqnagar News : సమాజంలో రోజురోజుకీ బంధాలు బాంధవ్యాలు కరువైపోతున్నాయి. ఒకరిపై మరొకరికి ప్రేమ, మమకారం, కనికరం లేని కక్షపూరిత సమాజం తయారవుతుంది. అడవిలో ఉన్న మృగాలకు సమాజంలో ఉన్న మనుషులకు తేడాలు లేని పరిస్థితులు దాపరిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ నానాటికి దిగజారిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత బలమైన కుటుంబ వ్యవస్థ గల దేశం భారతదేశాన్నికి చెందింది. అటువంటి మనదేశంలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న సంఘటనలు… సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలు పెరిగిపోయి.. ప్రాణాలు తీసేసుకుంటున్నారు. దీంతో పిల్లల జీవితాలు రోడ్డు పాలవుతున్నాయి.

Advertisement

నిమిషాల సుఖం కోసం ఎదుట వ్యక్తి ప్రాణాలను తీయడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు. వావివరసలు మరిచిపోయి బరితెగించి మరి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. కన్నవాళ్లే కాల యముడులా మారుతున్నారు. సరిగ్గా ఈ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలో ఓ దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జల్లా ఫరుఖ్ నగర్ పరిధిలోని ఓ ప్రాంతం. ఇక్కడే ఓ దంపతులు చాలా కాలం నుంచి నివాసం ఉంటున్నారు. వీరికి 16 ఏళ్ల కూతురు ఉంది. అయితే అనారోగ్య కారణాలతో అతని భార్య గతంలో మరణించింది. దీంతో కూతురిని జాగ్రత్తగా చూసుకోవలసిన తండ్రి.. కామ రాక్షసుడిగా మారాడు. భార్య చనిపోయాక కూతురితో శారీరకంగా కలుస్తూ తన కోరికలు తీర్చుకున్నాడు.

Farooqnagar latest news january 9th

Advertisement

కూతురితో బలవంతంగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. కన్న తండ్రే తనపై అత్యాచారానికి పాల్పడటంతో… విషయం ఎవరికీ చెప్పుకోవాలో తెలియక ఆ ఆడబిడ్డ కన్నీరు మున్నీరయింది. ఈ క్రమంలో పాఠశాలల్లో వాంతులయ్యి స్పృహతప్పి పడిపోవటంతో వెంటనే పాఠశాల సిబ్బంది హాస్పిటల్ కి తీసుకెళ్లారు. దీంతో వైద్యులు గర్భవతి అని తేల్చడంతో… ఒక్కసారిగా పాఠశాల ఉపాధ్యాయులు షాక్ అయ్యారు. వెంటనే విషయం మొత్తం ఆరా తీస్తే తన కన్న తండ్రి ఈ అగత్యానికి కారకుడని చెప్పడంతో ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి