Jamili Elections : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 4 నెలలే అవుతుంది. అయితే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని తాజాగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు జమిలి ఎన్నికలకు దేశమంతా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని, ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని చంద్రబాబు కూడా వ్యక్తం చేశారు. నిజానికి జమిలి ఎన్నికల వల్ల మిత్రులలో ఎక్కువగా నష్టం వాటిల్లేది ఏపీ సీఎం చంద్రబాబుకే. ఆయన అధికారానికి రెండున్నరేళ్లు కొత పడుతుంది.
చంద్రబాబు జమిలి ఎన్నికలకు అంగీకరించడానికి కారణం తన కుమారుడు లోకేష్ ని రాజకీయంగా మరింత ముందుకు తీసుకుని రావచ్చు అన్న ఆలోచనతోనే అని అంటున్నారు. 2026లో చివరిలో కానీ 2027 మొదట్లో కానీ జమిలి ఎన్నికలు జరిగిన పక్షంలో ఏపీలో కూటమి గెలిస్తే లోకేష్ కి సీఎంకి కుర్చీ దక్కే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఈసారి కూటమిలో సీట్ల షేర్ దగ్గరే సీఎం పోస్టు మీద కూడా ఒప్పందాలు చేసుకుంటారు అని అంటున్నారు. అంటే మూడేళ్ళు రెండేళ్ళు లెక్కన ఈ షేర్ ఉండొచ్చు. లేదా చెరి రెండున్నరేళ్ళు ఉండొచ్చని అంటున్నారు. ఇక చంద్రబాబుని సీనియారిటీ రిత్యా కేంద్రానికి తీసుకుని వెళ్ళి కేబినెట్ లో కీలక స్థానం ఇవ్వవచ్చు అన్న ప్రచారం కూడా ఉంది. అంటే జమిలి ఎన్నికలు వస్తే కనుక టీడీపీ కూటమి నుంచి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ సీఎం అభ్యర్ధులుగా ఉండే చాన్స్ కనిపిస్తోంది అని అంటున్నారు.
తక్కువ టైం లో ఎన్నికలు వస్తే తమకే లాభమని వైసీపీ కచ్చితంగా గెలుస్తుందని జగన్ అంటున్నారు. అంటే జమిలి ఎన్నికలు వస్తే ప్రధానంగా సీఎం సీటు కోసం పోటీ పడేది జగన్, లోకేష్ అని అంటున్నారు. ఎందుకంటే 2027 ప్రథమార్ధంలో ఎన్నికలు అంటూ జరిగితే మళ్ళీ 2032 దాకా ఎన్నికలు ఉండవు. అందువల్ల ఎవరూ అప్పటిదాకా తమ సీఎం కోరికలను దాచుకుంటూ ఉండలేరు. జమిలి ఎన్నికలకు జగన్ సేన సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.మరి చూడాలి ఎప్పుడు ఏం జరుగుతుందా అనేది.
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
Exit polls Maharashtra : బుధవారం జరిగిన మహారాష్ట్ర మరియు జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో అనేక ఎగ్జిట్ పోల్స్ బిజెపి నేతృత్వంలోని…
Mohini Dey : స్టార్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ar rahman భార్య సైరా బాను Saira Banu…
CBSE Board Exam 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నవంబర్ 20, 2024 బుధవారం…
Gautam Adani : రూ. 2,110 కోట్ల లంచం కేసులో Billionaire industrialist Gautam Adani అదానీ గ్రూప్ ఛైర్మన్…
Nokia x200 5G : ఒకప్పుడు కీ బోర్డ్ ఫోన్లలో రారాజుగా మార్కెట్ ని శాసించిన నోకియా స్మార్ట్ ఫోన్…
This website uses cookies.