
Chandrababu : సీఎంలో ఏం జరుగుతుంది చంద్రబాబుకి తెలియదా.. అంతా దీని గురించే చర్చ..!
Chandrababu చంద్రబాబు ఏపీ అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు.అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ పలు సూచనలు చేస్తున్నారు.శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేరాలకు పాల్పడేవారికి అదే చివరి రోజు అవుతుందని రౌడీలను హెచ్చరించారు. విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారని… వారంతా ప్రజల హృదయాలలో త్యాగధనులుగా నిలిచిపోయారని చంద్రబాబు అన్నారు. అన్ని శాఖల కంటే పోలీసు శాఖ అత్యంత కీలకమని చెప్పారు. రాష్ట్ర ప్రగతిలో పోలీసులది కీలక పాత్ర అని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటం కోసం పోలీసులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని కొనియాడారు. పోలీసుల శ్రమను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.
అలానే రీసెంట్‌గా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే మంత్రులతో భేటీ అయ్యారు. ఇసుక, మద్యం విషయాల్లో మీ జోక్యం వద్దని, గత ప్రభుత్వం ఇలాగే నష్టపోయిందని ఎమ్మెల్యేలు ఎంపీలు దూరంగా ఉండాలంటూ చంద్రబాబు వారికి పలు సూచనలు చేశారు. అయితే అదే సమయంలో ఎమ్మెల్యే, ఎంపీల విన్నపాలు ఆయనని ఆశ్చర్యపరిచాయి. నాలుగు నెలలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సీఎం అపాయింట్మెంట్ కానీ మంత్రి నారా లోకేష్ అపాయింట్మెంట్ కానీ దొరకటం లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు ఘోల్లున మొరపెట్టుకున్నారు. గత ప్రభుత్వంలో ఇలానే జరిగి ఆ పార్టీ దారుణంగా ఓడిపోయింది. తాజాగా టిడిపి కూటమి పార్టీల ఎమ్మెల్యేలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించటం.. గమనార్హం.
Chandrababu : సీఎంలో ఏం జరుగుతుంది చంద్రబాబుకి తెలియదా.. అంతా దీని గురించే చర్చ..!
గుంటూరుకే చెందిన ఒక ఎమ్మెల్యే పదిసార్లు తాను ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చానని అపాయింట్మెంట్ కోరుతూ నాలుగు సార్లు లేఖలు పెట్టానని ఆధారాలతో సహా చూపించారు. దీంతో ఆశ్చర్యపైన చంద్రబాబు ఏం జరుగుతోందో తాను ఎంక్వైరీ చేస్తానని అన్నారు. గతంలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన అధిపతి ఇలానే చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించగా, దొరకలేదు. దాంతో ఆమె సోషల్ మీడియా ద్వారా విన్నవించుకుంటే వెంటనే చంద్రబాబు ఆమెకి సారీ చెప్పి అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అయితే సీఎం ఓలో ఏం జరుగుతోందనేది చంద్రబాబుకు తెలుసా,తెలియదా అనేది అందరిని ఆశ్చర్యపరుస్తుంది
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.