Ysrcp : దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి వైకాపా ఎందుకు వచ్చింది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ysrcp : దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన పరిస్థితి వైకాపా ఎందుకు వచ్చింది..?

 Authored By himanshi | The Telugu News | Updated on :18 April 2021,12:30 pm

Ysrcp : ప్రతిష్టాత్మకంగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్ల పోలింగ్ పూర్తి అయ్యింది. హోరా హోరీగా సాగిన పోరులో వైకాపా ఘన విజయం సాధించడం ఖాయం అంటూ ఆ పార్టీ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలపై చాలా నమ్మకం పెట్టుకున్న టీడీపీ మరియు బీజేపీలకు చేదు అనుభవం తప్పదని ముందుగానే వారి మాటలను బట్టి అర్థం అవుతుంది. ఈ ఎన్నికలు ఏక పక్షంగా సాగాయని తప్పకుండా ఇందులో టీడీపీ మరియు బీజేపీపై వైకాపా అభ్యర్థి గురు మూర్తి ఘన విజయం సాధించడం ఖాయం.. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పనితనంకు ఓటర్లు ఇవ్వబోతున్న తీర్పు అంటూ వైకాపా నాయకులు నమ్మకంగా చెబుతున్నారు.

Ysrcp : దొంగ ఓట్లు ఎందుకు…

తిరుపతి ఉప ఎన్నికల సందర్బంగా తెలుగు దేశం మరియు బీజేపీ నాయకులు దొంగ ఓటర్లను పట్టుకోవడం జరిగింది. కొందరు మీడియా వర్గాల వారు కూడా దొంగ ఓటర్లను గుర్తించారు. ఓటరు కార్డుపై ఉన్న అడ్రస్ ను తండ్రి పేరును చెప్పలేక పోయిన వారు దొంగ ఓటర్లు కాకుండా ఎవరు అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గెలుపుపై ధీమా ఉన్న వైకాపా గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు దక్కించుకున్న వైకాపా ఎందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం గెలుపు కోసం దొంగ ఓట్ల పై ఆధారపడింది అంటూ బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. గెలుపు పై నమ్మకం లేకపోవడం వల్లే వారు ఈ పని చేశారనే ఆరోపణలు బీజేపీ నాయకులు చేస్తున్నారు.

Ysrcp

Ysrcp

Ysrcp : మెజార్టీ కోసమే..

వైకాపా ఖచ్చితంగా తిరుపతిలో గెలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. అయితే మెజార్టీ ఖచ్చితంగా 5 లక్షలు ఉండాల్సిందే అంటూ వైకాపా నాయకులను సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి హెచ్చరించాడు. మెజార్టీ తగ్గితే ఖచ్చితంగా శిక్ష తప్పదని వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక వైకాపా నాయకులు ఈ పని చేసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి ఈ దొంగ ఓట్లకు సంబంధం లేదు అనేది కొందరి వాదన. అయినా ఎక్కడ కూడా దొంగ ఓట్లు అనేవి పడలేదు అనేది ఎలక్షన్‌ కమీషన్ వాదన.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది