Home » Entertainment » Tollywood Actor Babu Mohan On Maa Election
Entertainment

Babu Mohan : ‘మా’ ఎన్నికలపై బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్?

Authored By
Jagadesh Gatla
The Telugu News | Published on: July 29, 2021, 8:00 pm
Advertisement

Babu Mohan : మా.. అంటే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన అసోసియేషన్. ఇదివరకు అసలు దీని గురించి పెద్దగా ఎవ్వరూ మాట్లాడుకునేవాళ్లే కాదు కానీ.. కొన్ని రోజుల నుంచి మా.. చాలాసార్లు వార్తల్లోకెక్కింది. దానికి కారణం ‘మా’ ఎన్నికలు. ఎన్నికల సమయానికే రచ్చ రచ్చ జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం కోసం కొందరు నటులు వేసే ఎత్తులు.. చేసే కామెంట్లు.. మిగితా నటులు మాట్లాడే మాటలు.. అన్నీ వివాదంతో కూడుకునేటివే.

Advertisement

tollywood actor babu mohan on maa election

ఇంకా ‘మా’ ఎన్నికలను నోటిఫికేషన్ రాలేదు కానీ.. ఇప్పటి నుంచే ఎన్నికల గురించి చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో ‘మా’ ఎన్నికల గురించి సీనియర్ నటుడు బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పటికే చాలామంది నటులు, ‘మా’ సభ్యులు.. ‘మా’ ఎన్నికలపై వివాదస్పదమైన కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా వాళ్ల లిస్టులోకి బాబు మోహన్ చేరారు.

Advertisement

Babu Mohan : ‘మా’ను కొన్ని చీడపురుగులు చెడగొడుతున్నాయి

మా అసోసియేషన్ ను కొన్ని చీడ పురుగులు చెడగొడుతున్నాయని బాబు మోహన్ అన్నారు. తాజాగా ఆయన ‘మా’ ఎన్నికల గురించి మాట్లాడుతూ… ‘మా’ అనేది మా కుటుంబం. ఇక్కడ జరిగేవి ఎన్నికలు కాదు.. కానీ.. కావాలని ‘మా’ ను కొందరు వివాదం చేస్తున్నారు. ‘మా’ ఎన్నికలు జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కానీ.. ఈ మధ్య ‘మా’ చాలా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. దానికి కారణం కొన్ని చీడపురుగులు. వాళ్ల వల్లనే ‘మా’ బజారున పడుతోంది. అన్ని వృత్తులలో ఉన్నట్టే ‘మా’లోనూ చీడ పురుగులు ఉన్నాయి. అసలు.. ‘మా’ లో జరిగేవి ఎన్నికలు కావు. మేము ‘మా’ బ్రదర్స్ కు.. సిస్టర్స్ కు ఓట్లు వేస్తున్నాం.. అని అనుకుంటాం. ఇదంతా ఒక ఫ్యామిలీ. ఇక్కడ పొలిటికల్ స్టంట్స్ ఏవీ ఉండవు. ‘మా’ను పెద్దలు కాపాడారు. చిరంజీవి, దాసరి లాంటి పెద్దలు దాన్ని ఇన్ని రోజులు కాపాడుకుంటూ వచ్చారు. కానీ.. చీడపురుగులు ఈ మధ్య ఎక్కువై ‘మా’ను చెడగొడుతున్నాయి.. అంటూ బాబు మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Jagadesh Gatla

Author Bio Info : Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి