Categories: FeaturedNationalNews

Train Horns: ఆడ‌వాళ్ల మాట‌ల‌కేమోగానీ.. రైలు కూత‌ల‌కైతే అర్థాలు వేరే..!

Train Horns: ప‌వ‌న్‌కళ్యాణ్ సినిమాలో ఆడ‌వారి మాట‌ల‌కూ.. అర్థాలే వేరులే..! అర్థాలే వేరులే.. అర్థాలే వేరులే..! అని ఓ పాట ఉంటుంది. ఆ పాట‌లో చెప్పిన‌ట్లుగా ఆడ‌వాళ్ల మాట‌ల‌కు అర్థాలు వేరో కాదో తెలియ‌దుగానీ, రైలు బండి కూత‌లకు ( Train horns ) మాత్రం అర్థాలు వేరేన‌ట‌. రైల్వే గార్డులను, సిబ్బందిని, ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు, హెచ్చరించేందుకు రైలు హారన్‌ల‌ను మోగిస్తుంటారు. ఇలా మొత్తం 11 రకాల హార‌న్‌లు ఉన్నాయ‌ట‌. అందులో ఒక్కో ర‌కానికి ఒక్కో అర్థం ఉంద‌ట‌. మరి ఆ రైలు కూత‌ల అర్థాలేమిటో మ‌నం కూడా తెలుసుకుందామా..?

Train Horns: రైలు హార‌న్‌ల‌లో రకాలు ఇవిగో..

  1. ఒక చిన్న హారన్: లోకో పైలట్ ఒక చిన్న హారన్ కొడితే రైలును శుభ్రం చేయడానికి యార్డుకు తీసుకెళ్తున్నట్టు అర్థమ‌ట‌.
  2. రెండు చిన్న హారన్‌లు: రెండు చిన్న హారన్‌ల శబ్దం వినిపిస్తే రైలు బయలుదేర‌డానికి సిగ్నల్ ఇవ్వాలని గార్టును లోకో పైలట్ కోరుతున్నట్టు అర్థమ‌ట‌.
  3. మూడు చిన్న హారన్‌లు: మూడు చిన్న హారన్‌లు మోగిస్తే మోటార్ పైన తన కంట్రోల్ పోయిందని, వ్యాక్యూమ్ బ్రేక్ వేయాలని గార్డుకు లోకోపైలట్ సమాచారం ఇస్తున్నట్టట‌. ఈ హారన్ చాలా అరుదుగా అవ‌స‌ర‌మ‌వుతుంద‌ట‌.
  4. నాలుగు చిన్న హారన్‌లు: రైలులో ఏద‌న్నా సాంకేతిక సమస్య ఉంటే లోకోపైలట్ నాలుగు సార్లు చిన్న హారన్‌లు మోగిస్తాడ‌ట‌. అంటే రైలు కదలడానికి సిద్ధంగా లేదని అర్థమ‌ట‌.
  5. ఒక లాంగ్ హార‌న్‌, ఒక షార్ట్ హారన్: ఇంజిన్‌ను స్టార్ట్ చేసేముందు బ్రేక్ పైప్ సిస్టమ్ సెట్ చేయాలని గార్డుకు సిగ్నల్ ఇచ్చేందుకు లోకోపైలట్ ఒక లాంగ్, ఒక షార్ట్ హారన్ ఇస్తారట‌.
  6. రెండు లాంగ్ హార‌న్‌లు, రెండు షార్ట్ హారన్‌లు: ఇంజిన్‌ను కంట్రోల్‌లోకి తీసుకోవాలని గార్డుకు సూచిస్తూ లోకోపైలట్ రెండు లాంగ్ హార‌న్‌లు, రెండు షార్ట్ హారన్‌లు ఇస్తారట‌.
  7. నిరంతరాయంగా హారన్: స్టేషన్‌లో హాల్ట్ లేనప్పుడు రైలు ఆగకుండా వెళ్తుందని ప్రయాణికులను అలర్ట్ చేయ‌డం కోసం లోకోపైలట్ నిరంతరాయంగా హారన్ మోగిస్తారట‌. నాన్‌స్టాప్ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేష‌న్‌ల‌లోకి వచ్చినప్పుడు ఈ హారన్‌లు వినిపిస్తాయ‌ట‌.
  8. రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్‌లు: రైలు రైల్వే క్రాసింగ్ దాటేట‌ప్పుడు ప‌ట్టాలు దాటుతున్న వారిని అప్రమత్తం చేసేందుకు లోకోపైలట్ రెండు స్వల్ప విరామాలతో రెండు హారన్‌లు మోగిస్తాడ‌ట‌.
  9. రెండు సార్లు లాంగ్ అండ్ షార్ట్ హార‌న్‌లు: రైలు ట్రాక్ మారుతున్న‌ప్పుడు లోకో పైలట్ రెండు సార్లు లాంగ్ అండ్ షార్ట్ హార‌న్‌లు మోగిస్తాడ‌ట‌.
  10. రెండు షార్ట్ హార‌న్‌లు, ఒక లాంగ్ హారన్: ప్యాసింజర్ చైను లాగినా, గార్డ్ వ్యాక్యూమ్ బ్రేక్ లాగినా లోకోపైలట్ రెండు షార్ట్ హార‌న్‌లు, ఒక లాంగ్ హారన్ మోగిస్తాడ‌ట‌.
  11. ఆరు షార్ట్ హారన్‌లు: రైలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నద‌ని లోకోపైలట్ ఆరు సార్లు షార్ట్ హారన్‌లు మోగిస్తాడ‌ట‌.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago