Ys Jagan : వైఎస్ జగన్ భజనలో తెలంగాణ తారకరాముడు.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Ys Jagan : వైఎస్ జగన్ భజనలో తెలంగాణ తారకరాముడు.!

Ys Jagan : ఇంతలోనే ఎంత మార్పు.? తెలంగాణ తారకరాముడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భజనలో మునిగి తేలారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ దావోస్ వెళితే, ఇదే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పెట్టుబడుల వేటలో ఇరు రాష్ర్టాలూ ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయ్. ఎంతైనా ఒకే తెలుగు నేలకు చెందిన వారు కదా. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :25 May 2022,10:00 am

Ys Jagan : ఇంతలోనే ఎంత మార్పు.? తెలంగాణ తారకరాముడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భజనలో మునిగి తేలారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ దావోస్ వెళితే, ఇదే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పెట్టుబడుల వేటలో ఇరు రాష్ర్టాలూ ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయ్. ఎంతైనా ఒకే తెలుగు నేలకు చెందిన వారు కదా. కేటీఆర్, వైఎస్ జగన్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా తీయించుకున్న ఫోటోలు మంత్రి కేటీయార్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పెట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక పదవుల్లో వున్న వ్యక్తులు ఒకే చోట కలిసి కనిపిస్తే మంచిదే కదా.! ఇదే స్నేహ భావంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అంతకన్నా కావాల్సిందేముంది.? కేంద్రం వద్ద రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాల్లోని కీలక వ్యక్తులు, తమ తమ సమస్యలకు సంబంధించిన గళాన్ని గట్టిగా, అది కూడా కలిసి వినిపిస్తే ప్రయోజనం ఎక్కువగానే వుంటుంది.అయితే, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రోడ్లపై తెలంగాణ మంత్రి కేటీయార్ చేసిన వ్యాఖ్యలు, ఈ క్రమంలో అట్నుంచి వైసీపీ నేతలు, మంత్రులు తెలంగాణ ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చిన విషయాలు ఇప్పుడు ప్రస్తావనకు వస్తున్నాయి.

TRS KTR Shocks All With Ys Jagan Photos

TRS KTR Shocks All With Ys Jagan Photos

కానీ, కేటీయార్ అప్పుడే తన తప్పుని తెలుసుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని అప్పట్లోనే చెప్పుకుంటూ ఓ ట్వీటేశారు.ఇదిలా వుంటే, దావోస్ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలు సమర్థవంతంగా తమ రాష్ట్రాల్లో పెట్టుబడులకు వున్న అవకాశాల్ని అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక వేత్తల ముందుంచుతున్నాయి. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకూ పెట్టుబడులు వచ్చేందుకు సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. పరస్పర సహకారం ఇలాంటి విషయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలూ అందించుకోవాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది