Home » Exclusive » Trs National Politics Utter Flop Show
Exclusive

TRS : గులాబీ పార్టీ జాతీయ రాజకీయం, అట్టర్ ఫ్లాప్ షో.!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: June 23, 2022, 8:30 pm
Advertisement

TRS : అంతా అనుకున్నట్టే జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి సైలెంటయిపోయింది. నిజానికి, ఇక్కడే తెలంగాణ రాష్ట్ర సమితి యాక్టివ్‌గా వుండి వుండాల్సింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, రాష్ట్రపతి ఎన్నికల విషయమై మంతనాలు జరిపి వుంటే, వ్యవహారం మరోలా వుండేది.
కేసీయార్ జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడం ఇప్పుడు కొత్తేమీ కాదు.

Advertisement

ఆయన అలా రాజకీయ ఆలోచన చేస్తుంటారు.. ఈ క్రమంలోనే ఏళ్ళు గడిచిపోతుంటాయ్. జాతీయ స్థాయిలో పలు పార్టీలతో గడచిన ఆరేడేళ్ళలో కేసీయార్ మంతనాలు జరపడం మినహా, ఒక్క అడుగు కూడా జాతీయ రాజకీయాల విషయమై కేసీయార్ ముందుకు వేసింది లేదు. భారత రాష్ట్ర సమితి.. అంటూ కేసీయార్ అండ్ టీమ్ ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది. ‘అవసరమైతే జాతీయ పార్టీ..’ అనుడు తప్ప, దాన్ని వాస్తవ రూపంలోకి గులాబీ బాస్ తీసుకురాలేకపోయారు.

TRS National Politics Utter Flop Show

Advertisement

నిజానికి, ఇప్పుడున్న రాజకీయాల్లో జాతీయ ఆలోచన ఎంత కష్టమైనదో తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు కేసీయార్. గులాబీ బాస్ విషయ పరిజ్ఞానం వున్న వ్యక్తి. అందుకే, ఆచి తూచి స్పందిస్తున్నారు.
జాతీయ రాజకీయాలపై ఆశలు వున్నా, ఆచరణలో అది సాధ్యం కాదని బహుశా కేసీయార్ అర్థం చేసుకుని వుండాలి. అందుకేనేమో, రాష్ట్రపతి ఎన్నికల వేళ సైలెంటయిపోయారు. దాంతో, సహజంగానే విపక్షాలకు కేసీయార్ ఆయుధం ఇచ్చినట్లయ్యింది.. తన మీద వాళ్ళు విమర్శలు చేయడానికి. ఈ రాజకీయ దాడిని ఈసారి కేసీయార్ తట్టుకోవడం అంత తేలిక కాదు.!

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి