TRS : గులాబీ పార్టీ జాతీయ రాజకీయం, అట్టర్ ఫ్లాప్ షో.!
TRS : అంతా అనుకున్నట్టే జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి సైలెంటయిపోయింది. నిజానికి, ఇక్కడే తెలంగాణ రాష్ట్ర సమితి యాక్టివ్‌గా వుండి వుండాల్సింది. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, రాష్ట్రపతి ఎన్నికల విషయమై మంతనాలు జరిపి వుంటే, వ్యవహారం మరోలా వుండేది.
కేసీయార్ జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడం ఇప్పుడు కొత్తేమీ కాదు.
ఆయన అలా రాజకీయ ఆలోచన చేస్తుంటారు.. ఈ క్రమంలోనే ఏళ్ళు గడిచిపోతుంటాయ్. జాతీయ స్థాయిలో పలు పార్టీలతో గడచిన ఆరేడేళ్ళలో కేసీయార్ మంతనాలు జరపడం మినహా, ఒక్క అడుగు కూడా జాతీయ రాజకీయాల విషయమై కేసీయార్ ముందుకు వేసింది లేదు. భారత రాష్ట్ర సమితి.. అంటూ కేసీయార్ అండ్ టీమ్ ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది. ‘అవసరమైతే జాతీయ పార్టీ..’ అనుడు తప్ప, దాన్ని వాస్తవ రూపంలోకి గులాబీ బాస్ తీసుకురాలేకపోయారు.
నిజానికి, ఇప్పుడున్న రాజకీయాల్లో జాతీయ ఆలోచన ఎంత కష్టమైనదో తెలుసుకోలేనంత అమాయకుడైతే కాదు కేసీయార్. గులాబీ బాస్ విషయ పరిజ్ఞానం వున్న వ్యక్తి. అందుకే, ఆచి తూచి స్పందిస్తున్నారు.
జాతీయ రాజకీయాలపై ఆశలు వున్నా, ఆచరణలో అది సాధ్యం కాదని బహుశా కేసీయార్ అర్థం చేసుకుని వుండాలి. అందుకేనేమో, రాష్ట్రపతి ఎన్నికల వేళ సైలెంటయిపోయారు. దాంతో, సహజంగానే విపక్షాలకు కేసీయార్ ఆయుధం ఇచ్చినట్లయ్యింది.. తన మీద వాళ్ళు విమర్శలు చేయడానికి. ఈ రాజకీయ దాడిని ఈసారి కేసీయార్ తట్టుకోవడం అంత తేలిక కాదు.!