
trs
TRS Party హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుల తిట్ల దండకం ఇటివల సోషల్ మీడియాతోపాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే.. ఒక సాధారణ వ్యక్తిలా.. అదికూడా పార్టీ అధికారిక వేదికలపై ప్రత్యర్థులను ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటున్నారు.. దీంతో పార్టీ నేతల వైఖరిపై ప్రజాస్వామ్యవాదులు నోరు వెల్లబెట్టడడం తప్ప వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి తలెత్తింది. సాధారణంగా పార్టీ నేతలు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిని వారించేందుకు పార్టీ హైకండ్ నేతలు ఉంటారు. కాని ఇక్కడ పార్టీని ఒక మార్గంలో నడిపించాల్సిన నేతలే తిట్ల తండకానికి వత్తాసు పలుకుతున్నారు.
ముఖ్యంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు తిట్లదండకం చేపట్టడంతో కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా ఇదే పద్దతిని పాటించడం అలవాటు చేసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఇటివల రేవంత్ రెడ్డి పై మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.. మంత్రి మల్లారెడ్డి యూనివర్శిటి భూముల్లో అక్రమాలు జరిగాయన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లోనే రెచ్చిపోయారు. ఒక దశలో తొడగొట్టి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.. రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మల్లారెడ్డి సవాల్ విసిరారు. తన యూనివర్శిటిలో ఒక్క ఎకరా భూమి కూడా అక్రమంగా లేదని స్పష్టం చేయడంతోపాటు రాజకీయాల్లోకి రాకముందే తనకు 600 ఎకరాల భూమి ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి ఆరోపణలపై స్పందిస్తూనే రాజీనామా చేసి ఎంపీ ఎన్నికల్లో పోటికి నిలబడాలని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
TRS Party
TRS Party వ్యాఖ్యల రచ్చపై కేటీఆర్ KTR
మరోవైపు మైనంపల్లి హనుమంతరావు సైతం ఇదే రీతిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై తిట్ల దండకం అందుకున్నారు. బండి సంజయ్ పై వీధుల్లో మాట్లాడుకునే భాషను ఉపయోగించారు. సుమారు ముప్పై నిమిషాల పాటు ఆగకుండా బండి సంజయ్‌పై ఫైర్ అయ్యారు. అయితే దీని వెనక టీఆర్ఎస్ పార్టీ స్ట్రాటజీ కూడా ఉన్నట్టు మంత్రి కేటిఆర్ చెబుతున్న మాటల ద్వారా అర్థమవుతోంది.. ముఖ్యంగా టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ఉద్యమంలో తిట్టిన తిట్లు పెద్ద సంచలనంగా మారేవి.. వాటిపై రోజుల తరబడి చర్చలు కూడా కొనసాగిన సంధర్బాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన సీఎం అయిన తర్వాత కొంత తగ్గించారు.
KTR
అయితే ఇప్పుడు అదే పద్దతిలో విరుచుకు పడేందుకు ఆ పార్టీ వ్యుహాలు రచిస్తున్నట్టుగా అర్థమవుతుంది.. మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటిఆర్ సమర్ధించడం..ఇంకా తమకు ఓపిక లేదని చెప్పడంతో పాటు ఏడు సంవత్సరాలుగా ప్రతిపక్షాల అనుచిత వ్యాఖ్యలు భరిస్తున్నామని అన్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ సైతం తన స్ట్రాటజీని మార్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షాల స్థాయిలోనే వారిని ఎదుర్కొంటామని, ఇకపై సీఎంను అనుచిత వ్యాఖ్యలతో విమర్శించినవారికి తగిన గుణపాఠం చెబుతామని మంత్రి హెచ్చరించారు. ఇది ఇలాగే కొనసాగితే.. మహారాష్ట్రలో నారయణ రాణే పరిస్థితి ఉత్పన్నమవుతుందని కూడా కేటీఆర్ హెచ్చరించారు. ఇందుకు అనుగుణంగానే ఆ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సైతం రాహుల్ గాంధీకి ఓ లేఖ రాయడం ..భవిష్యత్ పరిమాణాలు ఎలా ఉంటాయో.. చెప్పకనే చెబుతున్నాయి.
రాజస్థాన్‌లోని ఝాలావర్ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉంది. కేవలం ప్రేమించాడనే నెపంతో ఒక యువకుడిని…
Annadata Sukhibhava: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని అమలు చేస్తున్న కీలక పథకాలలో అన్నదాత సుఖీభవ…
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్…
Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
This website uses cookies.