KCR : బీజేపీని నెం.2 చేసేందుకే కేసీఆర్ ఈ పనులు.. బాబును మించాడుగా! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

KCR : బీజేపీని నెం.2 చేసేందుకే కేసీఆర్ ఈ పనులు.. బాబును మించాడుగా!

 Authored By himanshi | The Telugu News | Updated on :7 January 2022,2:40 pm

KCR : తెలంగాణ రాజకీయంగా రసకందాయంలో పడింది. ఎన్నికల హడావుడి మొదలు అయ్యేందుకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. అయినా కూడా అప్పుడే అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ పై బీజేపీ మరియు కాంగ్రెస్ లు యుద్దం చేస్తున్నాయి. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీకి జవసత్వాలు వచ్చినట్లుగా అనిపిస్తుంది. మళ్లీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు కాస్త ఆశల్లో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీని 2023 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు వస్తానంటూ రేవంత్‌ రెడ్డి భీష్మించుకు కూర్చున్నాడు. ఇదే సమయంలో ఆయన పార్టీ కార్యక్రమాలు చాలా అగ్రసివ్‌ గా ముందుకు తీసుకు వెళ్తున్నాడు.

ఈ పదేళ్ల పాలనలో కేసీఆర్‌ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మరియు ప్రజలకు జరుగుతున్న అన్యాయంను గురించి రేవంత్‌ రెడ్డి బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాడు. దాంతో కేసీఆర్ మసకబారుడుతున్నాడు అంటూ విశ్లేషణలు మొదలు అయ్యాయి. ఈ స మయంలో బీజేపీ కూడా దూకుడు మొదలు పెట్టింది. సాధ్యం అయినంత ఎక్కువగా బీజీని తెలంగాణలో నిలపాలని భావిస్తున్నారు. అందుకు గాను భారీ ఎత్తున కేంద్ర నాయకత్వంను దించడంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా చాలా యాక్టివ్‌ అవ్వడం జరిగింది. కేంద్ర మంత్రులు మరియు ఎంపీలు వారంకు ఒకటి రెండు సార్లు తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ బలోపేతంకు సిద్దం అవుతున్నారు.

trs party president kcr master plan with bjp and congress

trs party president kcr master plan with bjp and congress

KCR : బీజేపీ స్ట్రాంగ్ అయితే కాంగ్రెస్ వీక్‌ అప్పుడు టీఆర్‌ఎస్‌ నెం.1

ఈ సమయంలో టీఆర్‌ఎస్ తమ ప్రథాన ప్రత్యర్థి బీజేపీ అన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ని అరెస్ట్‌ చేయడం మొదలు నడ్డా ర్యాలీకి నో చెప్పడం వరకు చాలా కఠినంగానే బీజేపీ పట్ల కేసీఆర్‌ ప్రభుత్వం నడుచుకుంది. దాంతో బీజేపీ గురించిన చర్చ ప్రథానంగా సాగుతోంది. గడచిన వారం పది రోజులుగా తెలంగాణలో టీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాని ఎక్కడ కూడా కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన హడావుడి లేదు. రాష్ట్రంలో రెండవ అతి పెద్ద పార్టీ గా ఉన్న కాంగ్రెస్ గురించిన వార్తలు తగ్గించేందుకే కేసీఆర్‌ ఈ ప్లాన్ చేసి ఉంటాడు అనేది టాక్‌. బీజేపీ ఎంత చేసినా.. ఏం చేసినా కూడా తెలంగాణలో అధికారంలోకి రావడం అనేది కల. అందుకే కాంగ్రెస్‌ బలం పెరగకుండా జనాల్లో బీజేపీని నెం.2 చేయడం ద్వారా మళ్లీ నెం.1 గా తానే ఉండొచ్చు అనేది టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది.

బీజేపీ బలమైన పార్టీ గా తెలంగాణ లో నిలబడితే ప్రభుత్వ వ్యతిరేక ఓటీ చీలడంతో మళ్లీ టీఆర్‌ఎస్ కు అధికారం దక్కడం ఖాయం. చాలా ముందస్తు వ్యూహంతోనే బీజేపీ ని కేసీఆర్‌ ఢీ కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. లేదంటే పెద్దగా ప్రభావం చూపించని బీజేపీని కేసీఆర్‌ ఎందుకు పట్టించుకుంటాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్‌ రాజకీయంలో చంద్రబాబు నాయుడును మించి తలపండి పోయాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది