Categories: NewspoliticsTelangana

కేటీఆర్ సీఎంగానా? వద్దు బాబోయ్.. భయపడిపోతున్న ఆ టీఆర్ఎస్ నేతలు?

Advertisement
Advertisement

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఒకటే. అదే మంత్రి కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే.. ఎవరైనా ఆస్తులు పంచుతారు.. కానీ పదవులను కూడా పంచుతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ చర్చ జరుగుతున్నా.. గత కొన్ని రోజుల నుంచి మాత్రం ప్రచారం జోరందుకుంది.

Advertisement

trs senior leaders opposing ktr as cm of telangana

అయితే.. ప్రచారం మాట పక్కన పెడితే.. సొంత పార్టీ టీఆర్ఎస్ లో మాత్రం కేటీఆర్ సీఎం పదవిపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు అయితే బహిరంగంగానే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి.. అంటూ ప్రకటించారు. కానీ.. కొందరు సీనియర్ నేతలు మాత్రం కేటీఆర్  ను ముఖ్యమంత్రిగా చేసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. టీఆర్ఎస్ పార్టీలో పార్టీ మొదట్నుంచి ఉన్నవాళ్లు, పార్టీ కోసమే కష్టపడి పనిచేసిన చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్లకు ఈ విషయం మాత్రం మింగుడుపడటం లేదట.

Advertisement

కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే పార్టీకే ఇబ్బందులు?

ఒకవేళ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే పార్టీకి ఇబ్బందులు వస్తాయని వాళ్లలో వాళ్లే బాధపడుతున్నారట. అందుకే కొందరు నేతలు బయటికి కూడా రావడం లేదు. అసలు మీడియాతో కూడా మాట్లాడటం లేదు. కొందరు మంత్రులైతే తమ పనులు కూడా సరిగ్గా చేయకుండా లైట్ తీసుకుంటున్నారట. అయితే.. కేటీఆర్ సీఎం పదవి గురించి కొందరు మంత్రులు సీఎం కేసీఆర్ కు నివేదికలు పంపించారట.

ఈసమయంలో కేటీఆర్ ను సీఎం చేయడం అవసరమా?

అసలే ప్రజల్లో ప్రస్తుతం పార్టీ మీద నమ్మకం పోయింది. పార్టీ పరిస్థితులు బాగా లేవు. ఈ సమయంలో పార్టీలో ఇంత భారీ మార్పు చేస్తే ప్రజలు స్వీకరిస్తారా? పార్టీకి తీరని నష్టం వాటిల్లితే ఎలా? అంటూ సీనియర్ నేతలు తెగ భయపడుతున్నారట. కొందరు మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అందుకే సీఎం కేసీఆర్ తో డైరెక్ట్ గా మాట్లాడి.. వచ్చే ఎన్నికల దాకా మీరే సీఎంగా ఉండండి.. అంటూ ఉచిత సలహాలు ఇచ్చారట. మరి.. ఆ ఉచిత సలహాలను కేసీఆర్ పాటిస్తారా? లేక తన కొడుకును సీఎం పీఠం మీద చూడాలని ఉన్న కోరికను నెరవేర్చుతారా? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

51 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

2 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

3 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

4 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

5 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

6 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

7 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

8 hours ago

This website uses cookies.