కేటీఆర్ సీఎంగానా? వద్దు బాబోయ్.. భయపడిపోతున్న ఆ టీఆర్ఎస్ నేతలు?
తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఒకటే. అదే మంత్రి కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎందుకంటే.. ఎవరైనా ఆస్తులు పంచుతారు.. కానీ పదవులను కూడా పంచుతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా రోజుల నుంచి ఈ చర్చ జరుగుతున్నా.. గత కొన్ని రోజుల నుంచి మాత్రం ప్రచారం జోరందుకుంది.
అయితే.. ప్రచారం మాట పక్కన పెడితే.. సొంత పార్టీ టీఆర్ఎస్ లో మాత్రం కేటీఆర్ సీఎం పదవిపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యే, నాయకులు అయితే బహిరంగంగానే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటి.. అంటూ ప్రకటించారు. కానీ.. కొందరు సీనియర్ నేతలు మాత్రం కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు అంతగా ఇష్టపడటం లేదు. టీఆర్ఎస్ పార్టీలో పార్టీ మొదట్నుంచి ఉన్నవాళ్లు, పార్టీ కోసమే కష్టపడి పనిచేసిన చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్లకు ఈ విషయం మాత్రం మింగుడుపడటం లేదట.
కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే పార్టీకే ఇబ్బందులు?
ఒకవేళ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే పార్టీకి ఇబ్బందులు వస్తాయని వాళ్లలో వాళ్లే బాధపడుతున్నారట. అందుకే కొందరు నేతలు బయటికి కూడా రావడం లేదు. అసలు మీడియాతో కూడా మాట్లాడటం లేదు. కొందరు మంత్రులైతే తమ పనులు కూడా సరిగ్గా చేయకుండా లైట్ తీసుకుంటున్నారట. అయితే.. కేటీఆర్ సీఎం పదవి గురించి కొందరు మంత్రులు సీఎం కేసీఆర్ కు నివేదికలు పంపించారట.
ఈసమయంలో కేటీఆర్ ను సీఎం చేయడం అవసరమా?
అసలే ప్రజల్లో ప్రస్తుతం పార్టీ మీద నమ్మకం పోయింది. పార్టీ పరిస్థితులు బాగా లేవు. ఈ సమయంలో పార్టీలో ఇంత భారీ మార్పు చేస్తే ప్రజలు స్వీకరిస్తారా? పార్టీకి తీరని నష్టం వాటిల్లితే ఎలా? అంటూ సీనియర్ నేతలు తెగ భయపడుతున్నారట. కొందరు మంత్రులు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు అందుకే సీఎం కేసీఆర్ తో డైరెక్ట్ గా మాట్లాడి.. వచ్చే ఎన్నికల దాకా మీరే సీఎంగా ఉండండి.. అంటూ ఉచిత సలహాలు ఇచ్చారట. మరి.. ఆ ఉచిత సలహాలను కేసీఆర్ పాటిస్తారా? లేక తన కొడుకును సీఎం పీఠం మీద చూడాలని ఉన్న కోరికను నెరవేర్చుతారా? అనేది తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.