Home » News » Ts Inter Board Produced First Year Memos In Online From Today
News

Ts inter board : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త: నేడే మెమోలు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..!

Authored By
Inesh A
The Telugu News | Published on: January 7, 2022, 9:30 am
Advertisement

Ts inter board : విద్యార్థులకు ఇంటర్ బోర్డు తీపి కబురు అందించనుంది. ఇటీవల ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థుందరికీ కనీస మార్కులు వేస్తూ పాస్ చేయగా.. పాసైన విద్యార్థులందరికీ మార్కుల మెమోలను నేడు సాయంత్రం విడుదల చేయనుంది.

Advertisement

శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి విద్యార్థులు తమ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థులంతా https://tsble.cgg.gov.in వెబ్‌సైట్‌లో తమ మార్కులను చూసుకోవడంతో పాటు వారి వారి మార్కుల మెమోలను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. అలాగే వెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు.. వాటిని రద్దుచేసుకొని ఫీజు వెనక్కి తీసుకోవచ్చునని ఇంటర్ బోర్డు ఈ మేరకు స్పష్టం చేసింది.

Ts inter board produced first year memos in online from today

Advertisement

కళాశాల మళ్ళీ ప్రారంభమయిన అనంతరం అనగా.. ఫిబ్రవరి 1 తరువాత వారు చదువుతున్న కాలేజీల్లో ఇంతకుముందు రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ నగదును వెనక్కి తీసుకోవాలని ఇంటర్ బోర్డు తెలిపింది.

Inesh A

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి