రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30% వరకు పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పండుగల సీజన్‌లో ఛార్జీలు పెంచేందుకు సంస్థకు అనుమతి ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నప్పటికీ, ఈ పెంపు సామాన్య ప్రయాణికులకు ఆర్థిక భారం అవుతోంది. పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ ఛార్జీలను తగ్గించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
రాఖీ సందర్బంగా ఏకంగా 30 % చార్జీలను పెంచిన TSRTC
హైదరాబాద్‌లోని ఉప్పల్ నుండి మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరుకు వెళ్లాలనుకుంటున్న ప్రయాణికులు ఈ ఛార్జీల పెంపు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్స్‌ప్రెస్ బస్సులో సాధారణంగా రూ.220 ఉండే టికెట్ ధర, ప్రత్యేక బస్సులో రూ.330 వసూలు చేయడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇది సాధారణ ధర కంటే 50% అధికం. ఈ విధంగా పండగ సమయంలో ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఉండగా, దాని భారాన్ని పురుషులపై మోపుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ, మరోవైపు ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు పెంచి, పురుష ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేయడం సమంజసం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. పండుగ వేళ ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.