TTD Chairman : టీటీడీ అధ్యక్ష మోక్షం ఎవరికి.. దేవుడు కాదు బాబు కూడా అభయం ఇవ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TTD Chairman : టీటీడీ అధ్యక్ష మోక్షం ఎవరికి.. దేవుడు కాదు బాబు కూడా అభయం ఇవ్వాల్సిందే..!

TTD Chairman : ఏపీ లో కూటమి ప్రభుత్వం చేపట్టాక టీటీడీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అన్న దానికి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఆమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని వార్తలు రాగా అందులో ఎలా నిజం లేదని తెలుస్తుంది. టీటీడీ అధ్యక్ష పదవి విషయంలో అటు జనసేన, ఇటు బీజేపీ తో కలిసి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఐతే జనసేన, బీజేపీ తరపున కన్నా […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 July 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  TTD Chairman : టీటీడీ అధ్యక్ష మోక్షం ఎవరికి.. దేవుడు కాదు బాబు కూడా అభయం ఇవ్వాల్సిందే..!

TTD Chairman : ఏపీ లో కూటమి ప్రభుత్వం చేపట్టాక టీటీడీ అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు అన్న దానికి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఆమధ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి టీటీడీ అధ్యక్ష పదవి ఇస్తారని వార్తలు రాగా అందులో ఎలా నిజం లేదని తెలుస్తుంది. టీటీడీ అధ్యక్ష పదవి విషయంలో అటు జనసేన, ఇటు బీజేపీ తో కలిసి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది. ఐతే జనసేన, బీజేపీ తరపున కన్నా టీడీపీ నుంచే ఆ పదవి ఎవరికైనా ఇస్తారని అంటున్నారు.టీడీపీ తరపున బాగా వినిపిస్తున్న పేరు విజయనగరం అశోక్ గజపతిరాజు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన ఉన్నారు. టీడీపీ అధికారం లోకి వచ్చిన ప్రతిసారి మంత్రి పదవి చేశారు. ఈసారి అశోక్ గజపతి రాజు ఎన్నికల్లో పొటీ చేయలేదు. ఆయన కూతురు అదితి గజపతి రాజు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింది. ఆయనకు టీటీడీ అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించాలని చూస్తున్నారు చంద్రబాబు.

TTD Chairman టీటీడీ అధ్యక్ష్య పదవి రేసులో సినిమా వాళ్లు కూడా..

టీటీడీ అధ్యక్ష పదవి కోసం మురళి మోహన్, అశ్వనిదత్ లు కూడా రేసులో ఉన్నారని తెలుస్తుంది. మురళి మోహన్ కూడా ప్రత్యక్ష రాజకీయాలు చేశారు. 2009, 20014 లలో లోక్ సభకు పోటీ చేశారు మురళి మోహన్ మొదటిసారి ఓడిపోయినా రెండోసారి గెలిచారు. ఐతే ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మరోపక్క అశ్వనిదత్ కూడా 2004, 2009 అశ్వనిదత్ పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఇద్దరిలో కూడా ఎవరికో ఒకరికి అధ్యక్స పదవి వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

TTD Chairman టీటీడీ అధ్యక్ష మోక్షం ఎవరికి దేవుడు కాదు బాబు కూడా అభయం ఇవ్వాల్సిందే

TTD Chairman : టీటీడీ అధ్యక్ష మోక్షం ఎవరికి.. దేవుడు కాదు బాబు కూడా అభయం ఇవ్వాల్సిందే..!

ఐతే టీటీడీ అధ్యక్ష పదవి అంటే దాదాపు క్యాబినెట్ మినిస్టర్ రేంజ్.. దేశవిదేశాల నుంచి భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తారు. అలాంటి పదవి ఇస్తానంటే ఎవరు వద్దనరు. ఐతే టీడీపీలో వీళ్లే కాకుండా పార్టీని నమ్ముకుని ఉన్న ఇంకా కొంతమంది కూడా ఈ పదవికి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఐతే టీటీడీ అధ్యక్ష పదవి రావాలంటే స్వామి వారి ఆశీర్వాదమే కాదు చంద్రబాబు అభయం కూడా ఉండాలని అంటున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది