YS Jagan : ఏపీలో అదే కనుక జరిగితే.. వైఎస్ జగన్ కు కష్టమే.. రెండో సారి ముఖ్యమంత్రి పీఠం కలగానే మిగులుతుంది?
YS Jagan : వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఇంకో రెండేళ్ల సమయం ఉంది. 2019 లో ఏపీ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన జగన్ కు ఈ మూడేళ్ల కాలంలో రెండేళ్లు కరోనాకే సరిపోయాయి. 2024 లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడిప్పుడే సీఎం జగన్.. ప్రభుత్వ కార్యక్రమాల మీద, సంక్షేమ పథకాల మీద దృష్టి పెడుతున్నారు. ఆయనకు ముఖ్యమంత్రిగా ఇంకా చాలా ప్రజలకు చేయాలని ఉన్నా.. మొదటి టర్మ్ పూర్తి కావడానికి ఇంకా రెండేళ్లే సమయం ఉంది. ఆయనకు రెండో చాన్స్ ఏపీ ప్రజలు ఇస్తారా? ఇవ్వరా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశం అయింది. ఓవైపు కరోనా..
మరోవైపు వరదలు. వరదలతో ఏపీ మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. రైతుల పూర్తిగా పంటలను నష్టపోయి రైతాంగానికి వరద సాయాన్ని ప్రభుత్వం అందించడంలో విఫలం అయింది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యమంత్రి అయ్యాక జగన్… కేవలం విద్య, వైద్యం మీదనే దృష్టి పెట్టారనే వార్తలూ వినిపిస్తున్నాయి. విద్య, వైద్యం మీదనే దృష్టి పెట్టి మిగిలిన శాఖలను సీఎం విస్మరించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కరోనా సమయంలో కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు అనే అపవాదు కూడా లేకపోలేదు.
YS Jagan : వచ్చే ఎన్నికల్లో ఎక్కువ పోలింగ్ జరిగితే?
ఇవన్నీ పక్కన పెడితే.. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ ఎక్కువ శాతం పోలింగ్ ఏపీలో జరిగితే మాత్రం నష్టపోయేది జగనే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం పేద వర్గాలు పోలింగ్ లో పాల్గొంటే జగన్ కు వచ్చే నష్టమే లేదు. కానీ.. ఉన్నత స్థాయి వర్గాలు, మధ్య తరగతి ప్రజలు కూడా ఎక్కువ శాతంలో పోలింగ్ లో పాల్గొంటే వాళ్ల వల్ల జగన్ కు తీరని నష్టం జరుగుతుందనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇలాంటి వార్తలు వినిపించడానికి కారణమూ ఉంది. కేవలం పేదలకు నిధులను పంచిపెట్టడమే పనిగా జగన్ పెట్టుకున్నారని.. అభివృద్ధిని జగన్ పక్కన పెట్టారనే వార్తలూ గుప్పుమంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఎక్కువ శాతం ఓట్లు పోలయితే మాత్రం అవి జగన్ కు వ్యతిరేకంగా పోల్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇటీవల రెండు జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేలో మాత్రం వైసీపీకే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వస్తాయని తేలింది. ఆ సర్వేలో కూడా పాల్గొన్నది పేద ప్రజలే. వాళ్ల నాడి ప్రకారం జగన్ గెలుస్తారు. కానీ.. ఉన్నత స్థాయి వర్గం, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ శాతం పోలింగ్ లో పాల్గొంటే మాత్రం జగన్ కు కష్టమే అంటున్నారు. ఒకవేళ ఈ రెండేళ్లలో జగన్ అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తే మాత్రం చెప్పలేం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూద్దాం.. భవిష్యత్తులో ఏం జరగనుందో.