Karthika Deepam 3 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ 3 సెప్టెంబర్ 2021, శుక్రవారం ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1135 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత… ఆసుపత్రికి వెళ్లి తాళి కట్టు అంటూ కార్తీక్ ను బెదిరించిన విషయం తెలిసిందే. డాక్టర్ బాబు దగ్గరికి అదే సమయంలో దీప, సౌందర్య, ఆనందరావు విడివిడిగా బయలుదేరుతారు.
అయితే.. వాళ్లు బయలు దేరారో లేదో తెలుసుకోవడం కోసం.. దీప.. సౌందర్యకు ఫోన్ చేస్తుంది. తీరా చూస్తే సౌందర్య తన ఫోన్ ను ఇంట్లోనే పెట్టి వెళ్తుంది. శౌర్య ఫోన్ ను లిఫ్ట్ చేస్తుంది. అత్తయ్య.. పిల్లలకు తెలియకుండా బయలు దేరారా? వాళ్లకు అనుమానం రాలేదు కదా.. అని ప్రశ్నించగానే.. వచ్చింది.. నానమ్మ వాళ్లు ఇప్పుడే బయలుదేరారు. నానమ్మ ఫోన్ ఇక్కడే మరిచిపోయింది.. అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శౌర్య.
ఎప్పుడూ నేను బలయ్యేదాన్ని.. ఇప్పుడు వీళ్ల చేతుల్లో అత్తయ్య, మామయ్య కూడా. ఇంటికి వెళ్లాక ఎంత రచ్చ చేస్తారో ఏమో అని దీప మనసులో అనుకుంటుంది. కట్ చేస్తే.. ఆసుపత్రిలో డాక్టర్ బాబు బెడ్ మీద కూర్చొని ఉంటాడు. ఇంతలో మోనిత.. డాక్టర్ వేషంలో ఆసుపత్రికి వస్తుంది. కార్తీక్ దగ్గరికి వెళ్తుంది.
పట్టుకొని కట్టేసి.. రోషిణి మేడమ్ కు చూపించనా? లేక దీన్ని చంపేయనా? అని మనసులో అనుకుంటాడు కార్తీక్. నన్న చంపేస్తాడా? ఏంటి.. అని మోనిత కూడా మనసులో అనుకుంటుంది.
నీ మైండ్ లో ఏముందో నాకు తెలుసు. కానీ.. నా ప్లాన్ ఏంటో నీకు మాత్రం తెలియదు.. అంటుంది మోనిత. మీ వాళ్లు సేఫ్ గా ఉండాలి కదా కార్తీక్. బుద్ధిమంతుడిలా పడుకో.. అని చెబుతుంది మోనిత.
చాలా టెన్షన్ పడుతున్నట్టున్నావు. అందుకే నీ గుండె వేగం పెరిగింది. ఏం ఆలోచించావు. నీ కుటుంబం మాత్రమే బాగుండాలా? మన కుటుంబం బాగుండ కూడదా? లేదంటే నీ కుటుంబం అస్సలే ఉండకూడదా? అంటుంది మోనిత.
16 ఏళ్లు నువ్వు ప్రేమించా.. ప్రేమించా.. అంటే ఏంటో అనుకున్నా. 16 ఏళ్లు నీ రాక్షసత్వం తెలియకుండా నటించావు.. అని కార్తీక్ అనగానే.. షట్ అప్ కార్తీక్. ఇది రాక్షసత్వం కాదు. ప్రేమ… అంటుంది మోనిత.
పిచ్చి ప్రేమ కార్తీక్.. అంటుంది. ఉన్మాదుల ప్రేమ పొందే అదృష్టం నాకు అక్కర్లేదు అంటాడు కార్తీక్. ఇలాగే ఆలోచిస్తే.. మోనిత లాంటి అమోఘమైన వ్యక్తి ప్రేమను జారవిడుచుకుంటావు.. అంటుంది మోనిత. లోకంలో ప్రేమ అనే పదానికి చాలా విలువ ఉంది. నువ్వు ఆ ప్రేమ గురించి మాట్లాడి.. ప్రేమను పాతాళానికి తొక్కేయకు. నువ్వు ఎన్నో పాపాలు చేశావు. నీ నిజస్వరూపం గురించి తెలిసి కూడా నిన్ను చంపకుండా వదిలేసి పోయాను. అయినా నీ ఆట ఆగలేదు. ఇంకా ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నావు. నిన్ను చంపాలంటే నాకు క్షణం పట్టదు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు.. అంటాడు కార్తీక్.
నువ్వు చంపుతుంటే నీ చేతుల్లో ప్రాణాలు పోయినా పర్వాలేదు అని అనుకోవడానికి నేను దీపను కాదు. చచ్చాక సుఖం ఏం ఉంటుంది. చచ్చేటప్పుడడు ఏం సుఖం ఉంటుంది. ఇంత అందమైన శరీరాన్ని కాల్చేస్తారు. ఆ తర్వాత ఆత్మ అటూ ఇటూ తిరగాలి. కనీసం నాకు పిండం పెట్టే దిక్కు కూడా ఉండదు. జీవితంలో నచ్చిన దాన్ని పొందాలి. నచ్చిన మనిషిని సొంతం చేసుకోవాలి. అందుకే.. నీకోసం నేను పూలదారి ఏర్పాటు చేశాను. సామదాన దండోపాయాలు కూడా ప్రయోగించాను. ఇక.. ఆఖరు ప్రయత్నం ఇది.. అంటుంది మోనిత.
తన బ్యాగులో నుంచి తాళి తీస్తుంది. ఇంతలోనే దీప ఆసుపత్రికి వస్తుంది. తాళి… ఇది కడితేనే సహధర్మచారిణి అంటారు. లేదంటే.. సహజీవనం చేస్తుంది అంటారు. ఎవరు ఏం అనుకున్నా.. ఐడోంట్ కేర్. కానీ.. నా కడుపులో పెరిగే నీ బిడ్డకు తండ్రి నువ్వేనని సమాజం గుర్తించాలి కదా. అందుకైనా నువ్వు నా మెడలో తాళి కట్టాలి. ఈ మూడు ముళ్లు వేశావనుకో.. చిక్కు ముడిగా మారిన నీ ఫ్యామిలీ భవిష్యత్తు బాగుంటుంది. కట్టు కార్తీక్.. కట్టు.. తాళి కట్టు. నన్ను నీ దాన్ని చేసుకో… నిన్ను శిక్ష నుంచి తప్పిస్తాను. టైమ్ లేదు కార్తీక్. ఇప్పుడే కట్టేసేయ్. తీసుకో.. కట్టేయ్.. అంటూ బతిమిలాడుతుంది మోనిత.
ఇంతలోనే ఆనంద రావు ఆసుపత్రికి వస్తాడు. అత్తయ్య రాలేదా.. అని అడుగుతుంది. దీంతో కార్తీక్ పనిమీద మధ్యలో దిగి లాయర్ దగ్గరికి వెళ్లింది.. నేను, ఆదిత్య వచ్చాం.. అని చెబుతాడు ఆనంద రావు. కార్తీక్ ఎక్కడ.. అని అడుగుతాడు ఆనంద రావు. లోపలికి రండి.. అని చెబుతుంది దీప.
ఇప్పుడే వెళ్లి.. రోషిణి మేడమ్ కు సరెండర్ అయిపోతాను.. అని చెప్పి తాళి కట్టు అని చెబుతుంది మోనిత. ఇంతలోనే కార్తీక్ దగ్గరికి దీప, ఆనంద రావు, ఆదిత్య.. ముగ్గురూ వెళ్తుంటారు. నువ్వు నిర్దోషిగా విడుదల అవుతావు.. కట్టు.. త్వరగా కట్టు… అంటూ బతిమిలాడుతుంది మోనిత. తీసుకో… కట్టు కార్తీక్.. కట్టు.. అంటుంది.
ఇంతలోనే దీప, ఆనంద రావు, ఆదిత్య.. ముగ్గురూ అక్కడికి వస్తారు. వెంటనే మాస్క్ వేసుకొని.. కార్తీక్ ను టెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది మోనిత. నా విషయం చెబితే.. నా హాండ్ బ్యాగ్ లో ఉన్న రివాల్వర్ కు పని చెప్పాల్సి వస్తుంది. నీ వాళ్లు అందరూ ఇక్కడే పోతారు. ఇన్ని చేసిన దాన్ని ఇది చేయలేనా? అని అంటుంది మోనిత.
హా.. మీ వాళ్లు వచ్చినట్టున్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు కార్తీక్. నేను చెప్పినవన్నీ పాటిస్తే మీరు బాగానే ఉంటారు. అర్థమయిందనుకుంటాను.. అంటుంది మోనిత.
ఇది ఫ్యామిలీ గెట్ టుగెదర్ కాదు. ఇతను ఒక ఖైదీ.. అంటుంది మోనిత. కానీ.. మేము పోలీసుల పర్మిషన్ తీసుకొని వచ్చాం డాక్టర్ అని చెబుతాడు ఆనంద రావు. ఈ రత్నసీత ఎక్కడ చచ్చింది. ఫోర్స్ చేసి తాళి కట్టించుకుందామని చూస్తే.. ఇంతలోనే వీళ్లు వచ్చారేంటి.. మంచి చాన్స్ మిస్ అయింది.. అని అనుకుంటుంది మోనిత.
ఇఫ్ యూ డోంట్ మైండ్.. మీరు బయటికి వెళ్తే.. నేను మా ఫ్యామిలీతో పర్సనల్ గా మాట్లాడుకుంటాను.. అని అంటాడు కార్తీక్. వాట్.. ట్రీట్ మెంట్ ఆపేసి.. బయటికి వెళ్లాలా? ఏమనుకుంటున్నారు. మీరు కూడా డాక్టరేనని ఈమాత్రం మర్యాద ఇస్తున్నాను. పోలీస్.. పోలీస్.. అంటూ పిలుస్తుంది. దీంతో సారీ డాక్టర్ అంటుంది దీప. మీరు ఉండండి.. పర్వాలేదు.
నోరు తెరిస్తే శవాలు లేస్తాయని కార్తీక్ కు బాగా తెలుసు. చెప్పేస్తే ఏమౌతుంది.. మోనిత గురించి చెప్పాలా? వద్దా? అని ఆలోచిస్తుంటాడు కార్తీక్. నీకు ఎంతమంది పిల్లలు.. అని అడుగుతుంది మోనిత. ఇద్దరు పాపలు అని చెబుతుంది దీప.
నేను ఈ విషయం చెప్పేస్తే.. పిల్లలను ఏమైనా చేస్తానని బెదిరిస్తోందా? మోనిత విషయం చెప్పాలా? వద్దా.. అంటూ టెన్షన్ పడతాడు కార్తీక్.
మోనితను ఇక్కడే పట్టుకుంటే బెటర్ కదా.. అని అనుకుంటాడు. ఇంతలో మోనిత.. ఎస్సైకి ఫోన్ చేస్తుంది. మీరు అక్కడే ఉన్నారా? అంటుంది. దీంతో అక్కడే ఉన్నాం.. అంటారు. ఉండండి.. ఇద్దరూ అక్కడే ఉండండి. అని చెబుతుంది. ఆ తర్వాత కార్తీక్.. నో.. అంటూ అరుస్తాడు. దీంతో ఏమైంది.. అని దీప, ఆదిత్య, ఆనంద రావు భయపడతారు.
డాక్టర్ మావోడికి ఏమైంది. ఎందుకు అలా ఉన్నాడు.. అని అడుగుతాడు ఆనంద రావు. మీరంతా ఇలా చుట్టుముట్టి ఇక్కడ నిలబడితే ఎలా? ఆయన రెస్ట్ తీసుకోవాలి కదా. పేషెంట్ టెన్షన్ పడుతున్నాడు. అంతే కదా కార్తీక్.. అంటుంది మోనిత.
డాడీ… మీరు వెళ్లండి.. ఆదిత్య.. డాడీని, వదినను తీసుకెళ్లు. ఇక్కడి నుంచి తీసుకెళ్లు.. అంటూనే.. ఆదిత్యకు మోనిత గురించి సైగలు చేస్తుంటాడు. కానీ.. ఆదిత్యకు అర్థం కాదు. ఓకే.. ఓకే.. టెన్షన్ పడకండి.. అని అంటుంది మోనిత.
మీరంతా దయచేసి వెళ్తారా? అని అంటుంది మోనిత. మిమ్మల్ని చూస్తే పేషెంట్ భయపడుతున్నాడు.. ప్లీజ్.. అంటుంది మోనిత. వెళ్లు.. అంటూ దీపను కూడా అంటాడు. ఆనంద రావు ఏడ్చుకుంటూ వెళ్తాడు. ఆదిత్య, దీప తనవైపు చూస్తూ వెళ్లిపోతారు. దీప ఏడ్చుకుంటూ వెళ్లిపోతుంది.
వెరీ గుడ్ కార్తీక్. ఇప్పుడు నా మాట ఎలా విన్నావో.. అలాగే.. నేను చెప్పినట్టు చేశావనుకో.. అందరం బాగుంటాం. నీ వాళ్లందరూ బతికి ఉంటారు. నా ముందే నువ్వు నీ వాళ్లతో నా విషయం చెప్పేందుకు ట్రై చేస్తున్నావు. నిన్ను ఎలా నమ్మాలి.. అంటుంది మోనిత.
నువ్వు తొందరపడి చెప్పేస్తే.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు.. ఎవ్వరూ ఉండరు. అనాథలా పెరుగుతాడు నా బిడ్డ. నా బిడ్డకు ఆస్తి అవసరం లేదు. అందరూ కలిసి ఉండాలి. బాగా ఆలోచించుకో.. ఇప్పుడు నీ చేత తాళి కట్టించుకోవాలంటే.. నువ్వు ఏడుస్తూ కట్టేలా ఉన్నావు. అలా వద్దు. నువ్వు సంతోషంగా కట్టాలి. తర్వాత వస్తాను.. సరేనా.. లవ్యూ డియర్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది.
ఎలాగమ్మా.. వాడిని ఈ పరిస్థితిలో చూసి ఎలా తట్టుకోవాలి.. అని బాధపడతాడు ఆనందరావు. రోషిణి మేడమ్ కు చెప్పి వాడిని మన హాస్పిటల్ కు షిఫ్ట్ చేద్దాం అని దీపతో అంటాడు ఆనంద రావు. అవును.. వదిన.. అన్నయ్య పరిస్థితి చెబితే.. రోషిణి మేడమ్ కాదనరు.. అని అంటాడు ఆదిత్య. ఈ విషయాలన్నీ మోనిత వింటుంది.
ఒక్కసారి నువ్వు ఫోన్ చేయమ్మా.. నువ్వు రిక్వెస్ట్ చేస్తే కాదనదు.. అంటాడు ఆనంద రావు. అవసరం లేదు.. ఇప్పుడే మీ అబ్బాయితో మాట్లాడాను. తనకు శిక్ష పడితే.. తన ఫ్యామిలీ ఏమైపోతుందోనని టెన్షన్ పడుతున్నాడట. ట్రై టూ అండర్ స్టాండ్ హిమ్.. అంటూ కార్తీక్ ను ఆసుపత్రి నుంచి బయటికి వెళ్లకుండా చేస్తుంది మోనిత.
కార్తీక్.. ఇదే విషయం గురించి ఆలోచిస్తుంటాడు. ఏంచేయాలి? ఏం చేయాలి? అని పిచ్చోడు అవుతుంటాడు.. ఇంతలోనే సీరియల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే.. తరువాయి భాగంలో చూడాల్సిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.