MLA In Assembly : వీళ్లు ప్రజాప్రతినిధులా.. అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

MLA In Assembly : వీళ్లు ప్రజాప్రతినిధులా.. అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు?

 Authored By mallesh | The Telugu News | Updated on :25 September 2022,5:30 pm

MLA In Assembly : రాజకీయాలు సాధారణ మానవులకు పెద్దగా తెలియవు. రాజకీయాలతో వారికి సంబంధం లేదు. రాజకీయ నాయకులతోనూ వారికి పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే వీరితో నేరుగా సంబంధం సాధారణ ప్రజలు ఏర్పరచుకోలేరు. ఒకవేళ ఏర్పరచుకుందామనుకున్నా రాజకీయ నాయకులు జనాలకు వారి వద్దకు రానివ్వరు. ఒక ఎన్నికల సమయంలో మినహా ప్రజలు వారికి గుర్తుకు రావు. అయితే, ప్రజలు రాజకీయాలను ఏవిధంగా ప్రభావితం చేయగలుగుతారో.. అదే విధంగా రాజకీయాలు ఒక సామాన్యుడి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపుతాయి.

MLA In Assembly : నిండు అసెంబ్లీలో బుద్ది మరిచిన ఎమ్మెల్యేలు

రాజకీయ నాయకులకు అసెంబ్లీ అనేది ఆలయం వంటిదని చెప్పుకుంటుంటారు. ఎందుకంటే ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చట్టాలు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. ఒక సాధారణ వ్యక్తి ఎటువంటి జీవితాన్ని గడపాలి. పన్నులు ఎలా చెల్లించాలి. రోడ్డు మీద వెళ్లటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. తోటి ప్రజలతో ఎలా మెలగాలి. దొంగతనాలు, దోపిడీలు చేస్తే ఎలాంటి శిక్ష అనుభవిస్తారు.. ఇలా అనేక మంచి, చెడు, సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు అసెంబ్లీలో తీసుకుంటారు. రాజకీయ నాయకులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి వంటివారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యేలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు కృషిచేయాలి. కానీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలు ప్రజలను విస్మరించి అసెంబ్లీలో టైం పాస్ చేస్తే నష్టపోయేది సామాన్య ప్రజలే.

UP MLA Plays Video Games In Uttar Pradesh Assembly

UP MLA Plays Video Games In Uttar Pradesh Assembly

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్బంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పక్షం, ప్రతిపక్షం సమస్యలపై చర్చిస్తున్న సమయంలో ఝాన్సీ నియోజకవర్గం ఎమ్మెల్యే పొగాకు నములుతుండగా.. మరో ఎమ్మెల్యే వీడియో గేమ్ ఆడుతూ కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ సభా చర్చను పట్టించుకోలేదు.ఈ వీడియోను సమాజ్ వాది పార్టీ సామాజిక మాద్యామాల్లో షేర్ చేయగా తెగ వైరల్ అయ్యింది.దీంతో సదరు ఎమ్మెల్యేలపై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, వీరు చేసిన పనికి యోగి సర్కార్ వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది