Upasana | మెగా అభిమానుల‌కి ఉపాస‌న గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో రెండో బేబి రాబోతుందంటూ కామెంట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Upasana | మెగా అభిమానుల‌కి ఉపాస‌న గుడ్ న్యూస్.. త్వ‌ర‌లో రెండో బేబి రాబోతుందంటూ కామెంట్

 Authored By sandeep | The Telugu News | Updated on :14 September 2025,4:00 pm

Upasana | టాలీవుడ్‌లోని క్రేజీ జంట‌ల‌లో రామ్ చ‌ర‌ణ్‌-ఉపాస‌న జంట ఒక‌టి. 2012లో ఉపాసన కామినేనితో రామ్ చరణ్ కి వివాహం జరిగింది. ఏళ్ళు గడిచినా వీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు. ఎట్టకేలకు 2023లో ఉపాసన -చరణ్ తల్లిదండ్రులు అయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పేరు క్లిన్ కార. అయితే మెగా ఫ్యాన్స్ కి ఒక అసంతృప్తి ఉంది. రామ్ చరణ్ కి ఒక నటవారసుడు కావాలి. కాబట్టి అబ్బాయి కూడా ఉంటే బాగుండు అని భావిస్తున్నారు.

Upasana konidela రామ్ చరణ్ కూడా అలాంటి వాడే అని షాకింగ్ కామెంట్స్ చేసిన ఉపాసన

 

డ‌బుల్ న్యూస్..

వారి కోరిక తీరే అవకాశం త్వరలోనే ఉందని ఉపాసన గుడ్ న్యూస్ చెప్పింది. సెకండ్ చైల్డ్ ని వెంటనే ప్లాన్ చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తాజా ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ… నేను ఆలస్యంగా పిల్లలను కనాలి అనుకున్నాను. అందుకే పదేళ్ల తర్వాత తల్లిని అయ్యాను. ఈ విషయంలో విమర్శలు, ఒత్తిడి ఎదురైనా నేను పట్టించుకోలేదు. కానీ రెండో బిడ్డ విషయంలో అలా కాదు. సెకండ్ చైల్డ్ ని కనడానికి నేను సిద్ధంగా ఉన్నాను… అని వెల్లడించారు.

కుటుంబ పరంగానే కాకుండా, వ్యాపార రంగంలోనూ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమదైన ముద్ర వేసుకుంటున్నారు హైదరాబాద్ నగరంలో ఓ అత్యాధునిక లగ్జరీ మల్టీప్లెక్స్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మల్టీప్లెక్స్ నిర్వహణ బాధ్యతలను ఉపాసన చేపట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త వ్యాపారానికి మెగాస్టార్ చిరంజీవి కూడా సంపూర్ణ మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది