Jobs | తెలంగాణ‌లో కొలువుల పండుగ‌.. ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు!

Authored By Sam C | The Telugu News | Updated on : 6 October 2025, 8:00 pm

Jobs | తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి ఇకపై వరుసగా నోటిఫికేషన్లు విడుద‌ల చేసేందుకు ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తులు చేస్తుంది. టీజీపీఎస్సీతో పాటు పలు రిక్రూట్‌మెంట్‌ బోర్డులు ఇదే పనిలో ఉన్నాయి. పోస్టుల ఖాళీలపై ఆయా శాఖల నుంచి వివరాలు తీసుకుంటున్నాయి.గ్రూప్1 కింద 563 పోస్టులకు ఎంపికైన వారికి ఇటీవలే అపాయింట్మెంట్ ఆర్డర్లు అందాయి. అలాగే, 783 గ్రూప్-2 సెలక్షన్ లిస్టును కూడా విడుదల చేశారు. వారికి కూడా నియామక పత్రాలు త్వరలోనే అందనున్నాయి.

#image_title

గుడ్ న్యూస్..

గ్రూప్ 3 పోస్టుల భర్తీకి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ షెడ్యూల్ వచ్చేసింది. ఈ నియామక ప్రక్రియను కూడా ఈ నెల​లోపే పూర్తిచేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది. ఆ తర్వాత కొత్త ఉద్యోగాల భర్తీపై కసరత్తు చేయనుంది. ఈ మేరకు అగ్రికల్చర్, విద్యా శాఖ నుంచి వివరాలు కూడా తీసుకుంది. అంతేకాదు, కొత్త రిజర్వేషన్లకు అనుగుణంగా రోస్టర్ పాయింట్ల సమాచారాన్ని కూడా సేకరించింది.

తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడి డిసెంబరు నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. ఆలోగా నోటిఫికేషన్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. దాదాపు 25,000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.పోలీస్ శాఖలోనే 17,000 ఖాళీలు ఉన్నాయి. అలాగే, గురుకులాల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. విద్య, వ్యవసాయ, విద్యుత్తు, వర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నారు. గ్రూప్ 1, 2, 3, 4కు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

Sam C

No bio available for this author.

  1. "YS Jagan : 2029 లక్ష్యంగా జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీలో భారీ మార్పులకు శ్రీకారం?"

  2. "New pensions : లబ్ధిదారులకు శుభవార్త .. ఆగస్టు 15 నుంచి 2.25 లక్షల మందికి కొత్త పింఛన్లు.. ఎవరికెవరికీ వస్తాయంటే?"

  3. "Rice price : ప్రజలకు గుడ్ న్యూస్.. ఆధార్ ఉంటే చాలు..తక్కువ ధరకే బియ్యం.. ఎక్కడ దొరుకుతుంది? ఎలా కొనాలి? వివరాలివే.."

  4. "Karthika Deepam 2 Today Episode August 04 : సూరజ్‌పై జ్యోత్స్న ఆగ్రహం.. పెళ్లి ఆపేందుకు కుటుంబంలో కొత్త డ్రామా!"

  5. "Gold Rate Today : బంగారం కొనేవారికి శుభవార్త.. ఆగస్టు 4న 22, 24 క్యారెట్ల తాజా రేట్లు ఇవే!"

  6. "Viagra Benefits : క్యాన్సర్‌పై వయాగ్రా ప్రభావం? ..ఇజ్రాయెల్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు.. ?"

  7. "Fruit Sticker: పండ్లపై ఉన్న స్టిక్కర్ అర్థం తెలుసా? .. 4, 8, 9 ఈ కోడ్ తెలియకపోతే మోసపోయే అవకాశం!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp