Us Elections 2024 : మలా హారిస్ Vs ట్రంప్ .. ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..!
Us Elections 2024 : ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మంగళవారం పోలింగ్ కాగా, దేశంలో మొత్తం 24.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. అయితే ఇద్దరి నేతలకి ఏయే అంశాలు కలిసి వస్తాయి అన్నది చూస్తే.. చైనా, పాకిస్తాన్ పట్ల డెమోక్రాట్లు పెద్దగా వ్యతిరేకంగా […]
ప్రధానాంశాలు:
Us Elections 2024 : మలా హారిస్ Vs ట్రంప్ .. ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..!
Us Elections 2024 : ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. మంగళవారం పోలింగ్ కాగా, దేశంలో మొత్తం 24.4 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోరు కొనసాగుతోంది. అయితే ఇద్దరి నేతలకి ఏయే అంశాలు కలిసి వస్తాయి అన్నది చూస్తే.. చైనా, పాకిస్తాన్ పట్ల డెమోక్రాట్లు పెద్దగా వ్యతిరేకంగా కనిపించడం లేదు. కానీ, ట్రంప్ చైనాకు బద్ధ వ్యతిరేకిగా ఉన్నారు. మరోవైపు పాకిస్తాన్ అంటే ట్రంప్ కు పెద్దగా నచ్చదు. దీంతో పాక్ ప్రజలు డెమోక్రాట్ల గెలుపునే కోరుకుంటున్నారు…..
Us Elections 2024 ఎవరికి అవకాశాలు ఎక్కువ..
ట్రంప్ గెలిస్తే చైనాపై పోరులో భారత్ కు అమెరికా మద్దతు లభించే అవకాశం ఉంది. మరోవైపు డెమోక్రాట్లు గెలిస్తే మన వాళ్ల ఉద్యోగాలకు డోకా ఉండదు. ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే విదేశీ వలసదారులపై కఠిన వైఖరి తప్పేలా లేదు. తాను గెలిస్తే రష్యాతో ఒప్పందం కుదుర్చుకునేలా ఒత్తిడి తెస్తానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పుకొచ్చారు. మరోవైపు ట్రంప్ గెలిస్తే.. చైనా, ఇరాన్.. అమెరికాకు శత్రువులుగా మారే అవకాశాలు ఉన్నాయి. హారిస్ అధ్యక్షురాలైతే రష్యా సవాళ్లను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఇజ్రాయెల్ విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థుల తీరు ఒకేలా ఉంది. నెవడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కమలా హారిస్‌కు మంచి ఆదరణ లభిస్తుండగా; ఆరిజోనాలో డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రజల నుంచి భారీగా మద్దతు లభిస్తోందని పోల్స్ చెబుతున్నాయి.
ఇక స్వింగ్ రాష్ట్రాల్లోని మిషిగన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఈ ఇరువురు నేతల మధ్య గట్టిపోటీ నెలకొన్నట్లు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. క్యాపిటల్ అల్లర్లు, వరుస కేసుల్లో నేరారోపణలు, ఓ కేసులో దోషిగా తేలడం వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, ట్రంప్ దూకుడు కనబర్చారు. ప్రజల్లో ఆయనకు మద్దతు ఏడాది పొడవునా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువే కొనసాగింది. చాలా మంది రిపబ్లికన్లు ఆయన్ను రాజకీయ కుట్రలకు బాధితుడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.డొనాల్డ్ ట్రంప్‌నకు అనేక సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, విభజన రాజకీయాలు చేసే నేతగా ముద్రపడిపోయింది. హారిస్ ఆయన్ను ఫాసిస్టుగా పేర్కొంటూ, ప్రజాస్వామ్యానికి ముప్పుగా చెబుతున్నారు. డ్రామాలు, సంఘర్షణల నుంచి ముందుకు సాగుతానని ప్రతిజ్ఞ చేశారు. ఓటర్లు తనను స్థిరత్వం కలిగిన అభ్యర్థిగా చూడాలని ఆశిస్తున్నారు.అమెరికన్ ఎన్నికలు ఖరీదైన వ్యవహారం. ఖర్చుల విషయానికి వస్తే హారిస్ అగ్రస్థానంలో ఉన్నారు. ఫైనాన్షియల్ టైమ్స్ విశ్లేషణ ప్రకారం 2023 నుంచి ట్రంప్ సేకరించిన దానికంటే జులైలో బరిలో దిగిన హారిస్ ఎక్కువ నిధులు కూడగట్టారు. ప్రకటనల కోసం ఆమె దాదాపు రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేసినట్లు తేలింది