Uttam Kumar Reddy : నేనే 3 లక్షలు కర్చుపెట్టా.. ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు?
Uttam Kumar Reddy : ప్రస్తుతం తెలంగాణలో కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. కరాళనృత్యం చేస్తోంది. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో పాటు.. మరణాల కూడా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కూడా వెంటనే అలర్ట్ అయింది. దిద్దు బాటు చర్యలను ప్రారంభించింది. వెంటనే కరోనా నియంత్రణ కోసం మే 12 నుంచి తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. మే 12 నుంచి ఉదయం 10 నుంచి తెల్లారి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ను విధించింది రాష్ట్ర ప్రభుత్వం. కేవలం ఉదయం 6 నుంచి ఉదయం 10 వరకు మాత్రమే ఏదైనా కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సడలింపు కేవలం 4 గంటలు మాత్రమే.
అయితే.. కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా విఫలం అయిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి Uttam Kumar Reddy మండిపడ్డారు. కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తుంటే ప్రభుత్వాలకు పట్టదా? అంటూ ప్రశ్నించారు. కేవలం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ KCR అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Uttam Kumar Reddy : కరోనా విరుచుకుపడుతుంటే నిధులు ఎందుకు కేటాయించడం లేదు?
కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్ తీవ్రంగా విఫలం అయ్యారు. అసలు.. కరోనాను ఆయన పట్టించుకోవడం లేదు. ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఆయన బయటికి రాకుండా సేఫ్ గానే ఉంటున్నారు కానీ.. ప్రజలను మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాగే ఉంటే తెలంగాణ చాలా సమస్యల్లో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఓవైపు కరోనా రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంటే.. కేసీఆర్ KCR మాత్రం ఆరోగ్యశాఖకు నిధులు ఎందుకు కేటాయించడం లేదు? అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు. నాకు కరోనా సోకితే.. నేను కరోనా నయం కావడానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టా. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. సామాన్య ప్రజలు, పేద ప్రజలు కరోనా సోకితే.. 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టగలరా? ప్రభుత్వం ఎందుకు కరోనాను అంత లైట్ తీసుకుంటోంది.. తగిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ ఉత్తమ్ కుమార్ తీవ్రస్థాయిలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.