
uttar pradesh family organises terahvin of rooster
Viral News : కొంతమంది పెంపుడు జంతువులని మనుషుల కన్నా ఎక్కువగా చూసుకుంటారు.వాటికి ఏమైన అయితే అల్లాడిపోతుంటారు. చాలా నీరసించిపోతుంటారు. కొందరు వాటి మీద ఉన్న ప్రేమ కొద్ది వాటికి సమాధులు కట్టించడం కూడా చూస్తుంటాం. కానీ మనుషులు చనిపోతే చేసినట్టుగా కుటుంబమంత హడావుడి చేసి.. అంత్యక్రియలు నిర్వహించి దశదినకర్మలు చేయడం.. అందరినీ పిలిచి భోజనాలు పెట్టడం అనేది ఇటీవల కొన్ని ప్రాంతాలలో వింటున్నాం. అలాంటి ఓ వింత ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని ఓ కుటుంబంపెంచుకుంటున్నపెంపుడు కోడిపుంజు చనిపోయింది.
ఆ కుటుంబం ఆ కోడిపుంజుకి అంత్యక్రియలు నిర్వహించడమే కాకుండా.. కుటుంబ సభ్యులు చనిపోతే చేసినట్లుగా అన్ని తతంగాలు చేశారు. 500 మందిని పిలిచి భోజనాలు కూడా పెట్టారు. తమ పెంపుడు కోడిపుంజుకు దశదినకర్మ నిర్వహించడమే కాకుండా… 500 మందికి భోజనాలు కూడా పెట్టారు.అందుకు కారణం కూడా లేకపోలేదు. ఒకరోజు వారు పెంచుకుంటున్న ఒక నెల వయసున్న గొర్రె పిల్లను అది కాపాడింది. ప్రాణాలకు తెగించి, ఊరకుక్కల బారి నుంచి కాపాడింది. ఈ క్రమంలో అది తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది. దాని త్యాగం, ప్రేమ ఆ కుటుంబాన్ని కలచివేసింది. దీంతో, మనిషికి ఎలాగైతే అంత్యక్రియలు చేస్తారో దానికి కూడా అలాగే చేశారు. అంతేకాదు, దాని ఆత్మకు శాంతి చేకూరాలని దశదినకర్మను కూడా నిర్వహించారు.
uttar pradesh family organises terahvin of rooster
‘మన కుటుంబంలోని మనిషి మాదిరిగా.. మన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టింది. కాబట్టే మనుషులకు చేసే విధంగా ఆచారాలు అన్నింటినీ ఈ కోడిపుంజుకి నిర్వహిద్దామని తండ్రి చెప్పడంతో ఇలా చేశామ’ని చెబుతున్నారు అభిషేక్. ఆ కోడిపుంజు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబం పెద్ద ఎత్తున దశదినకర్మ నిర్వహించింది. అంతేకాదు ఈ కార్యక్రమానికి సుమారు 500 మంది దాకా హాజరవడం విశేషం. గతనెల జూన్ లో కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ పెంపుడు కుక్క బర్త్ డేకు వంద కిలోల కేక్ కట్ చేశాడు. మందు లేదు కానీ.. మాంసంతో మంచి భోజనం వడ్డించాడు దాని యజమాని. అతిథులు కేక్ తిని భోజనాలు చేసి…ఆ కుక్కకు శుభాకాంక్షలు తెలిపారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.